యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ ప్రవేశాల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఏటా సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. డిగ్రీలో ప్రవేశాల కోసం సీయూఈటీ యూజీ (CUET UG-2023) పరీక్షకు సంబంధించి ఫిబ్రవరి 9 నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం ప్రారంభించారు. మార్చి 12తో ఆ గడువు ముగుస్తుంది. మే 21 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏర్పాట్ల గురించి యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ మాట్లాడారు. పరీక్షకు సంబంధించి రిజస్టర్డ్ యూనివర్సీటీలు పెరుగుతాయని అన్నారు. 45 సెంట్రల్ యూనివర్సిటీలు సీయూఈటీ పరీక్షను తప్పనిసరి చేశాయి. తర్వాత 89 యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించగా ఆ తర్వాత 150కు చేరింది. ఈ సంఖ్య 200కు చేరుతుందని జగదీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. సీయూఈటీ ఎగ్జామ్ స్కోర్ ద్వారా ఆయా యూనివర్సిటీల్లో ప్రవేశాలు జరుగుతాయన్నారు. దీని వల్ల విద్యార్థులకే మంచిదన్నారు.
CUET UG: మే 21 నుంచి సీయూఈటీ పరీక్షలు.. ఈ సారి పక్కా ఏర్పాట్లు!
ఈ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్థులు విభిన్న నైపుణ్యాలను పరీక్షించే వివిధ ప్రశ్నలకు ఆన్సర్ చేయడం ప్రాక్టీస్ చేయడం ముఖ్యం. సంబంధిత సబ్జెక్టులలో మంచి నాలెడ్జ్ పొందాలంటే NCERT పుస్తకాలను చదువుకోవాలి. గతేడాది పేపర్లను కూడా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మోడల్ ప్రశ్నలను తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో TOPPER సంస్థ వారు అందించిన మోడల్ పేపర్లు అందిస్తున్నాం. పైన అటాచ్ చేసిన పీడీఎఫ్ ద్వారా కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించిన మోడల్ పేపర్ ను అభ్యర్థులు తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CUET 2023, Exams, JOBS