నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశంలోని 80 సెంట్రల్, స్టేట్, డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET) నిర్వహిస్తోంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ పరీక్ష 2023 మే 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, పాల్గొనే యూనివర్సిటీల వివరాలను అధికారిక వెబ్ సైట్లో చూడొచ్చు. వాస్తవ ప్రపంచ పరిస్థితుల ఆధారంగా మీ జ్ఞానం, నైపుణ్యాలను, మీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించిన ప్రశ్నలు ఈ పరీక్షలో ఉంటాయి. ఈ రకమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు అవసరమవుతాయి.
CUET UG: మే 21 నుంచి సీయూఈటీ పరీక్షలు.. ఈ సారి పక్కా ఏర్పాట్లు!
ఈ పరీక్షకు సిద్ధం కావడానికి విభిన్న నైపుణ్యాలను పరీక్షించే వివిధ ప్రశ్నలకు ఆన్సర్ చేయడం ప్రాక్టీస్ చేయడం ముఖ్యం. సంబంధిత సబ్జెక్టులలో మంచి నాలెడ్జ్ పొందాలంటే NCERT పుస్తకాలను చదువుకోవాలి. గతేడాది పేపర్లను కూడా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మోడల్ ప్రశ్నలను తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో TOPPER సంస్థ వారు అందించిన మోడల్ పేపర్లు అందిస్తున్నాం. పైన అటాచ్ చేసిన పీడీఎఫ్ ద్వారా Biology సబ్జెక్టుకు సంబంధించిన మోడల్ పేపర్ ను అభ్యర్థులు తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CUET 2023, Exams, JOBS