Home /News /jobs /

CUET 2022 TIPS TO ACE THE COLLEGE ADMISSION ENTRANCE UMG GH

CUET: సీయూఈటీలో టాప్ స్కోర్ మీ టార్గెటా..? అయితే, ఈ టిప్స్ పాటించండి.. బెస్ట్ ర్యాంక్ మీదే..!

సీయూఈటీ ఎగ్జామ్స్ టిప్స్

సీయూఈటీ ఎగ్జామ్స్ టిప్స్

సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు (UGC)ల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET)ను ఈ ఏడాది నుంచి నిర్వహిస్తున్నారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ (Entrance Exams)లో బెస్ట్ స్కోర్ సాధించి, టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందడానికి ఎలానో చూడండీ.

ఇంకా చదవండి ...
సెంట్రల్ యూనివర్సిటీల్లో (Central University) అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు (UGC)ల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET)ను ఈ ఏడాది నుంచి నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 53 సెంట్రల్ యూనివర్సిటీ‌లతో పాటు 12 స్టేట్ యూనివర్సిటీలు, 11 డీమ్డ్ యూనివర్సిటీలు, 19 ప్రైవేట్ యూనివర్సిటీలు సైతం సీయూటీఈ స్కోర్‌ ఆధారంగా అడ్మిషన్‌లను చేపట్టనున్నాయి. దీంతో ఈ పరీక్షకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, సీయూటీఈ పరీక్షకు కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ సాధించి, టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందడానికి ఎలాంటి ప్రిపరేషన్ టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం.

ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యేవారు ముందు ఒక షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా మాక్ పేపర్‌లను ప్రాక్టీస్ చేయడం, కీలకమైన సబ్జెక్టులను రివిజన్ చేయడం, టఫ్ సబ్జెక్టులను స్టడీ చేయడానికి వేర్వేరు ప్లాన్లు రెడీ చేసుకోవాలి. మరికొన్ని టిప్స్ ఏవంటే..

ఇదీ చదవండి: వాట్సాప్ సూపర్ అప్‌డేట్.. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ టైమ్ లిమిట్‌ పెంపు.. ఎన్ని రోజులంటే..?


* సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్‌పై అవగాహన
ఏదైనా పరీక్షకు సిద్ధమయ్యే ముందు పరీక్ష సిలబస్ తెలుసుకోవాలి. తర్వాత ప్రిపరేషన్‌‌కు సహాయపడే కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. కీ టాపిక్స్ కోసం సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఈ ఏడాది NCERT జారీ చేసిన 12వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి సీయూఈటీ సిలబస్‌ను రూపొందించారు.

* టైమ్ టేబుల్
ప్రిపరేషన్ కోసం టైమ్‌టేబుల్‌‌ను రూపొందించుకోవడం వల్ల విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ అవసరమయ్యే సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడానికి, తదనుగుణంగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్‌లో మెరుగైన టైమ్ మేనేజ్‌మెంట్ కోసం ఈ ప్లానింగ్ సహాయపడుతుంది. CUET పరీక్షకు హాజరయ్యే చాలా మంది విద్యార్థులు ఇటీవల బోర్డు పరీక్షలకు హాజరయ్యారు. దీంతో సబ్జెక్ట్స్, పరీక్ష ప్యాట్రన్‌పై అవగాహన ఉంటుంది. అలాగే మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయడంతో పాటు రివిజన్‌పై ఎక్కువ దృష్టి పెడితే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: జేఎన్‌టీయూలో స్పెషల్ సర్టిఫికెట్ కోర్సులు.. ఫుల్ డీటైల్స్ మీ కోసం


* ప్రాక్టీస్‌ కొనసాగించడం
కాన్సెప్ట్‌లను ప్రాక్టీస్ చేయడంతోపాటు టెస్ట్ ఫార్మాట్ ఆధారంగా మాక్ టెస్ట్‌లను ప్రయత్నించడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల మీరు ఎందులో బలంగా ఉన్నారో వేటిలో వీక్‌గా ఉన్నారో అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆయా టాఫిక్స్‌పై ఎక్స్‌ట్రా ఫోకస్ పెట్టవచ్చు. ప్రతి టాపిక్‌పై సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దీంతో వాటిని సాధ్యమైనంత ప్రభావవంతంగా రీకాల్ చేసుకోవడానికి, అదే సమయంలో ప్రిపరేషన్‌ అవ్వడానికి దోహదపడుతుంది.



* ఒత్తిడి నివారణకు రిలాక్సేషన్
పరీక్షలో ఉత్తమ స్కోర్ కోసం బాగా ప్రిపేర్ కావడం ఎంత అవసరమో, చదువుతున్నప్పుడు మధ్యమధ్యలో విరామం తీసుకోవడం కూడా అంతే అవసరం. మానసిక, శారీరకంగా దృఢంగా ఉండడం కోసం అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలి. పరీక్ష ఒత్తిడి సాధారణ దినచర్యకు అవాంతరాలను సృష్టిస్తుంది. అయితే స్పష్టమైన ఏకాగ్రత, తగినంత విశ్రాంతి వల్ల పరీక్షను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, CUET 2022, Entrance exams, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు