సెంట్రల్ యూనివర్సిటీ (Central University) ల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం CUET నిర్వహిస్తారు. 2022-23 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అధికారిక నోటీస్ ప్రకారం ఈ ప్రక్రియ మే6న ముగుస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ cuet.samarth.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ మోడ్‌లో జూలైలో ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. ప్రశ్నాపత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉండనుంది. అయితే త్వరలో అప్లికేషన్ ప్రాసెస్ ముగుస్తున్న నేపథ్యంలో.. దరఖాస్తు విధానం ఎలా ఉంటుందో చూద్దాం.
CUET-2022 దరఖాస్తు విధానం
స్టెప్-1: ముందుగా అధికారిక సైట్ cuet.samarth.ac.in లోకి లాగిన్ అవ్వాలి.
స్టెప్-2: హోమ్ పేజ్‌లో CUET -2022 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-3: ఆ తరువాత కొత్త పేజీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫారంను ప్రాసెస్ చేయండి.
స్టెప్-4: అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
స్టెప్-5: భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
CUET 2022: అవసరమయ్యే డాక్యుమెంట్స్
సీయూఈటీ దరఖాస్తు చేసేటప్పుడు 10వ తరగతి మార్క్‌షీట్, 12వ తరగతి మార్క్‌షీట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, అభ్యర్థి సంతకం, ఫోటో ID రుజువు (ఆధార్ కార్డ్) , కేటగిరీ సర్టిఫికేట్ (వర్తిస్తే) అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
అర్హత ప్రమాణాలు
ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు CUET- 2022 ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. యూనివర్సిటీలు గతంలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది కూడా అడ్మిషన్ ఇవ్వడానికి అనుమతి ఇస్తే... అలాంటివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
సిలబస్‌పై యూజీసీ ప్రకటన
యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ మాట్లాడుతూ... 12వ తరగతి సిలబస్ ఆధారంగా CUET 2022 పరీక్ష ఉంటుందన్నారు. అయితే 11వ తరగతి సిలబస్ నుంచి ఎటువంటి ప్రశ్నలు అడగరని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒరియా, ఇంగ్లీషు ఇలా 13 భాషల్లో ఏదో లాంగ్వేజ్‌లో పరీక్ష రాయవచ్చు.
TS Police Job Preparation: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టైం టేబుల్ ట్రై చేయండి
కాగా, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ వంటి సెంట్రల్ యూనివర్సిటీలు CUET - 2022 స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నాయి. జామియా హమ్దార్డ్, TISSతో సహా అనేక ఉన్నత కళాశాలలు సైతం CUET ద్వారా విద్యార్థులకు అడ్మిషన్లు కేటాయించనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CUET 2022, EDUCATION