హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CUET 2022: సీయూఈటీకి ఆ స్టేట్స్ నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు.. ఈ రాష్ట్ర‌ల్లో అంతంతే..

CUET 2022: సీయూఈటీకి ఆ స్టేట్స్ నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు.. ఈ రాష్ట్ర‌ల్లో అంతంతే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

CUTET 2022 | సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశ పరీక్షనే సీయూఈటీ. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై వారం గడుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు లక్షకు పైగా ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

సెంట్రల్ యూనివర్సిటీ (Central University) ల్లో ప్రవేశాల కోసం ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశ పరీక్షనే సీయూఈటీ. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై వారం గడుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు లక్షకు పైగా ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాలైన బీహార్, ఢిల్లీ, యూపీ నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని... అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి దరఖాస్తులు అంతగా రాలేదని మీడియా వర్గాలు తెలిపాయి.

AICTE: ఆన్‌లైన్ కోర్సులపై ప్రతిపాదనలకు ఏఐసీటీఈ ఆహ్వానం.. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై సంస్థ దృష్టి

ఏప్రిల్ 13 వరకు వచ్చి దరఖాస్తుల్లో అత్యధికంగా యూపీ నుంచి 36,611 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర విద్యా శాఖ డేటాలో వెల్లడైంది. 23,418 దరఖాస్తులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా..12,275 మంది అభ్యర్థులతో బీహార్ తర్వాతి స్థానంలో నిలిచిందని మీడియా వర్గాలు తెలిపాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణ భారతంలో సీయూఈటీకి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో 3,987దరఖాస్తులతో కేరళ ముందు వరుసలో ఉంది. ఇక తమిళనాడు 2143, తెలంగాణ 1807, ఏపీ 1022, కర్నాటక నుంచి కేవలం 901 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

ఎన్‌సీఈఆర్టీ ఆధారంగా నిర్వహించే CUET వల్ల రాష్ర్ట బోర్డు విద్యార్థులకు సమాన అవకాశాన్ని అందించదని, దీంతో సీయూఈటీ పరీక్షను ఉపసంహరించుకోవాలని తమిళనాడు ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఈ తీర్మాణాన్ని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది. ఈ విషయంలో డీఎంకే ప్రభుత్వానికి బీజేపీ మినహా అన్ని తమిళ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. దీని ఫలితంగానే దక్షిణాది రాష్ట్రాల నుంచి సీయూఈటీ కోసం దరఖాస్తులు అనుకున్నంత స్థాయిలో రాలేదని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సీయూఈటీ పరీక్ష కోసం దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ మరో 15 రోజులు పైగా ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ప్రారంభ ట్రెండ్‌‌లో దక్షిణాది రాష్ట్రాల నుండి అభ్యర్థులు తక్కువ మొగ్గు చూపుతున్నారు. CUET దరఖాస్తులు ఏప్రిల్ 6న ప్రారంభం కాగా, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 6గా నిర్ణయించింది ఎన్‌టీఏ.

Jobs in Telangana: సింగ‌రేణిలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. మూడు రోజులు ఇంట‌ర్వ్యూలు

అంతకుముందు CUET అడ్మినిస్ట్రేషన్ విభాగం అన్ని రాష్ట్రాల ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలకు ఓ విజ్ఞప్తి చేసింది. సక్రమంగా, ఏకరీతిలో అడ్మిషన్ ప్రక్రియ కోసం అందరూ CUETని అనుసరించాలని కోరింది. దీని వల్ల బహుళ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉపశమనం కల్గిస్తుందని పేర్కొంది. సీయూఈటీ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, రాష్ట్ర, ప్రైవేట్ డీమ్డ్-టు-బీతో సహా దాదాపు 18 యూనివర్సిటీలు తమ అడ్మిషన్ ప్రక్రియను CUET స్కోర్ ఆధారంగా చేపట్టాలని నిర్ణయించుకున్నాయి.

UGC: ఉన్నత విద్యపై యూజీసీ కీలక నిర్ణయం.. విద్యార్థుల‌కు మ‌రింత సౌల‌భ్యం

కాగా, సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం CUET నిర్వహిస్తారు. 2022-23 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.in ద్వారా కొసాగుతోంది. కంప్యూటర్ మోడ్‌లో పరీక్ష జరగనుంది. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నాప్రతం ఉండనుంది. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తం 13 భాషల్లో సీయూఈటీని నిర్వహించనున్నారు.

First published:

Tags: Higher education

ఉత్తమ కథలు