CUET 2022 MORE CUET APPLICATIONS FOR ADMISSIONS IN DELHI UNIVERSITY THESE ARE THE MOST COMPETITIVE VARSITIES GH VB
CUET 2022: ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఎక్కువ CUET దరఖాస్తులు.. ఎక్కువ పోటీ ఉండే వర్సిటీలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు CUET ద్వారా అడ్మిషన్లు పొందడానికి పోటీ పడుతున్నారు. దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం దాదాపు 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్(Under Graduates) కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా CUET నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 44 సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు 12 స్టేట్ యూనివర్సిటీలు(University), 11 డీమ్డ్ యూనివర్శిటీలు(Universities), 19 ప్రైవేట్ యూనివర్సిటీలు (Private Universities)సైతం CUET స్కోర్ ఆధారంగా అడ్మిషన్లను చేపట్టనున్నాయి. UGC చైర్పర్సన్(Chairpersons) విశ్లేషించిన డేటా ప్రకారం..దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు CUET ద్వారా అడ్మిషన్లు(Admissions) పొందడానికి పోటీ పడుతున్నారు. దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం దాదాపు 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) కూడా CUET ద్వారా ఎంపిక చేసుకున్న కాలేజీల జాబితాలో చేరింది. దాదాపు 3.94 లక్షల మంది విద్యార్థులు బీహెచ్‌యూలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే అలహాబాద్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం 2.31 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
యూనివర్సిటీలు- దరఖాస్తులు
ఢిల్లీ యూనివర్సిటీ 6 లక్షల దరఖాస్తులతో మొదటి స్థానంలో ఉంది. బనారస్ హిందూ యూనివర్సిటీ 3.94 లక్షలు, అలహాబాద్ యూనివర్సిటీ 2.31 లక్షలు, బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ 1.49 లక్షలు , జామియా మిలియా ఇస్లామియా 1.21 లక్షలు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం దాదాపు 57,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేనుకున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీ దరఖాస్తుల విషయంలో గత రికార్డులను బ్రేక్ చేసింది. గతేడాది ఇదే యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 3.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పరిమిత కోర్సులకు మాత్రమే CUCET స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి కూడా 1.21 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రసిద్ధి చెందిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు 57,000 దరఖాస్తులు వచ్చినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక పేర్కొంది.
స్టేట్ యూనివర్సిటీల జాబితాను పరిశీలిస్తే... అంబేద్కర్ యూనివర్సిటీ- ఢిల్లీ 1.28 లక్షల దరఖాస్తులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూపీకి చెందిన డాక్టర్ APJ అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ 97,376 దరఖాస్తులతో రెండో స్థానంలో నిలిచింది. మీరట్‌కు చెందిన IIMTకి 1.37 దరఖాస్తులతో ప్రైవేట్ యూనివర్సిటీల్లో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
రాష్ట్రాల వారీగా ప్రారంభ ట్రెండ్లను పరిశీలిస్తే సీయూఈటీ కోసం దక్షిణాది నుండి రిజిస్ట్రేషన్లు తక్కువ రాగా, ఉత్తరాది ప్రాంతాలు అధిక ఆసక్తిని కనబరిచాయి. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ తర్వాత ఢిల్లీ (1.5 లక్షల రిజిస్ట్రేషన్లు), బీహార్ (83,672), హర్యానా (69,349), మధ్యప్రదేశ్ (62,394), రాజస్థాన్ (48,016) తరువాతి స్థానంలో నిలిచాయి. ఇక, దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో చెప్పుకోదగ్గ స్థాయిలో 40,476 దరఖాస్తులు రాగా, తమిళనాడులో 16,590 దరఖాస్తులు వచ్చాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.