హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CUET 2022: సీయూఈటీ ఫలితాల్లో వివాదం.. ఆ విధానంతో మార్కులు తగ్గాయంటున్న అభ్యర్థులు.. NTA స్పందన ఇదే..

CUET 2022: సీయూఈటీ ఫలితాల్లో వివాదం.. ఆ విధానంతో మార్కులు తగ్గాయంటున్న అభ్యర్థులు.. NTA స్పందన ఇదే..

CUET 2022

CUET 2022

CUET 2022: దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్ష, కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(సీయూఈటీ)-2022 నిర్వహించారు. ఫలితాలను కూడా ఇటీవల ఎన్‌టీఏ వెల్లడించింది. అయితే మార్కుల లెక్కింపు కోసం చేపట్టిన విధానం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీ (Central University)ల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్ష, కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(CUET)-2022 నిర్వహించారు. ఈ పరీక్షను ఈ ఏడాది తొలిసారిగా చేపట్టారు. ఫలితాల(Exam Results)ను కూడా ఇటీవల ఎన్‌టీఏ (NTA) వెల్లడించింది. అయితే మార్కుల లెక్కింపు కోసం చేపట్టిన విధానం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. చాలా మంది విద్యార్థులు తమకు మార్కులు తగ్గాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* ఈక్విపర్సెంటైల్ పద్దతిలో..

సీయూఈటీ-2022 స్కోర్‌ను ఈక్విపర్సెంటైల్ పద్దతిలో లెక్కించారు. పర్సంటైల్ స్కోర్‌కు బదులుగా నార్మలైజ్డ్ మార్కుల కోసం ఈ పద్దతి ఫాలో అయ్యారు. ఈ విధానం వల్ల తమకు మార్కులు తగ్గాయని చాలా మంది విద్యార్థులు అంటున్నారు. ఉత్తీర్ణత మార్కులు లేనప్పటికీ, నార్మలైజ్డ్ స్కోర్ ఆధారంగానే వివిధ యూనివర్సిటీలు మెరిట్ జాబితాను విడుదల చేయనున్నాయి. అలాగే కటాఫ్ స్కోర్‌ను డిక్లేర్ చేయనున్నాయి. సీయూఈటీ అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్స్ సహాయంతో మార్కులను లెక్కించిన తర్వాత, మార్కుల శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అయితే నార్మలైజ్డ్ చేయడం ద్వారా తమ పర్సంటైల్ గణనీయంగా తగ్గిందని వాపోయారు.

* అడ్మిషన్ ప్రక్రియ

సీయూఈటీ-2022 ద్వారా అడ్మిషన్ ప్రక్రియ ఇప్పుడు అర్హత, ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్య, దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీ అడ్మిషన్ విధానంతో పాటు నార్మలైజ్డ్ మార్కులపై ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ యూనివర్సిటీతో పాటు మరికొన్ని వర్సిటీలు టై-బ్రేకింగ్ విధానంలో భాగంగా 12వ తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇంకొన్ని యూనివర్సిటీలు 12వ తరగతి మార్కులను లెక్కించేటప్పుడు కొంత వెయిటేజీని కూడా ఇచ్చే అవకాశం ఉంది.

* ఎన్‌టీఏ స్పందన

ఈక్విపర్‌సెంటైల్ పద్ధతిలో.. సేమ్ సెషన్‌లోని ఇతర విద్యార్థుల రా మార్క్స్‌తో(Raw Marks)మార్కులతో పోల్చి, అభ్యర్థికి వచ్చిన రా మార్క్స్‌ను బట్టి ప్రతి అభ్యర్థికి పర్సంటైల్‌ను లెక్కిస్తారు. ఈ పర్సంటైల్స్‌ను ఈక్వల్ చేసి నార్మలైజ్డ్ మార్కులుగా మారుస్తారు. ప్రతి షిఫ్ట్‌లో విద్యార్థుల రా మార్క్స్‌ను గుర్తించడం ద్వారా పర్సంటైల్‌లను అవరోహణ క్రమంలో అమర్చిన తర్వాత, విద్యార్థుల మార్కులను లెక్కించడానికి లీనియర్ ఇంటర్‌పోలేషన్‌ను ఉపయోగిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. ఆ తర్వాత ఒక్కో విద్యార్థిక నార్మలైజ్డ్‌ మార్కులను లెక్కిస్తారు.

ఇది కూడా చదవండి : రూ.10 కోట్ల విలువైన స్కాలర్‌షిప్స్‌ ప్రకటన .. అర్హత వీళ్లకే..

మరోపక్క ఈ వివాదంపై ఎన్‌టీఏ స్పందించింది. పర్సంటైల్ స్కోర్‌ ఆధారంగానే నార్మలైజ్డ్ విధానంలో విద్యార్థుల స్కోర్ లెక్కించామని, పరీక్ష డిఫికల్టీ లెవల్స్ కారణంగా అభ్యర్థులకు లబ్ధి లేదా నష్టం జరగకుండా ఉండడంలో సహాయపడుతుందని ఎన్‌టీఏ పేర్కొంది. ఈ విధానంతో అభ్యర్థికి సంబంధించిన నిజమైన మెరిట్ గుర్తించవచ్చని వివరించింది. మల్టిపుల్ పేపర్లు ఉన్న పరీక్షలకు ఈ విధానమే సరైందని ఎన్‌టీఏ చెప్పుకొచ్చింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, CUET 2022, EDUCATION, JOBS

ఉత్తమ కథలు