Home /News /jobs /

CUET 2022 IN DEBUT YEAR LETS CHECK AT EVERYTHING THAT WENT WRONG IN THE COMMON ENTRANCE TEST LIKE TECHNICAL GLITCHES GH SRD

CUET 2022: తొలిసారి జరుగుతున్న సీయూఈటీ పరీక్షలకు ఎన్నో అవాంతరాలు.. బయటపడ్డ లోపాలు ఇవే..

CUET 2022

CUET 2022

CUET 2022: సీయూఈటీ ఎగ్జామ్స్‌ను ఆగస్టు 20 నాటికి పూర్తిచేయాలని భావించింది పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ). అయితే వివిధ ఎగ్జామ్ సెంటర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో కొన్నిచోట్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది మొదటిసారిగా ప్రవేశపెట్టిన సీయూఈటీ పరీక్షలకు తొలి నుంచి ఎదురైన అవాంతరాలను పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ (Central Universities)ల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(CUET 2022)ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీయూఈటీ-2022 పరీక్షలు ప్రారంభమై నెల రోజులు గడిచాయి. తొలుత ఆగస్టు 20 నాటికి పరీక్షలను పూర్తిచేయాలని భావించింది పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA). అయితే వివిధ ఎగ్జామ్ సెంటర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో కొన్నిచోట్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎగ్జామ్ చివరి నిమిషంలో కూడా సెంటర్లను మార్చిన సందర్భాలు ఉన్నాయి. సీయూఈటీ-2022 ఎగ్జామ్‌ను మొత్తంగా ఆరు ఫేజ్‌లుగా విభజించారు. అనేక వాయిదాల తరువాత ఈనెల 28న పరీక్షలు ముగియనున్నాయి. కాగా, ఈ ఏడాది మొదటిసారిగా ప్రవేశపెట్టిన సీయూఈటీ పరీక్షలకు తొలి నుంచి ఎదురైన అవాంతరాలను పరిశీలిద్దాం.

* మొదటి రోజే ఎగ్జామ్ సెంటర్ మార్పు
సీయూఈటీ-2022 జులై 15న ప్రారంభమైంది. అయితే మొదటి రోజు పరీక్ష ప్రారంభమవుతుండగా, చివరి నిమిషంలో పరీక్ష కేంద్రాన్ని మార్చారు. దీంతో చాలా మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. ఉదయం స్లాట్‌లో ఢిల్లీలోని అనేక ఎగ్జామ్ సెంటర్లలోకి అభ్యర్థులను అనుమతించలేదు. ఇందుకు కారణం చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాన్ని మార్చడమే. అయితే వారికి తదుపరి తేదీలో పరీక్ష రాయడానికి అవకాశం కల్పించారు.

* ఫేజ్ 2 & 3 సాంకేతిక సమస్యలు
సీయూఈటీ-2022 రెండో ఫేజ్ పరీక్షలు సాంకేతిక సమస్య కారణంగా పలుచోట్ల వాయిదా పడ్డాయి. కాగా, రెండో ఫేజ్‌ పరీక్షలు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జరిగాయి. పలు సెంటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడ వాయిదా వేశారు.

రెండో దశలో పరీక్షలు రాయలేని వారి కోసం ఆగస్టు 24 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆగస్టు 20న విడుదల చేయనున్నారు. ఇక, ఆగస్టు 7, 8, 10 తేదీల్లో జరిగిన ఫేజ్ 3 పరీక్షలకు కొందరు అభ్యర్థులు మిస్ అయ్యారు. దీంతో ఆగస్టు 21, 22, 23 తేదీల్లో జరిగే పరీక్షలకు హాజరుకావడానికి వారికి అనుమతి ఇచ్చారు.

* వర్షాల కారణంగా పరీక్ష రద్దు
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కేరళ, ఇటానగర్‌లోని కొన్ని కేంద్రాల్లో రెండు, మూడో దశ పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఆగస్టు 24-28 మధ్య పరీక్షలు రాసేందుకు వీరికి అనుమతి ఇచ్చారు.

ఇది కూడా చదవండి : తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్

* ఫేజ్ 4లో 13 కేంద్రాల్లో పరీక్ష రద్దు
ఆగస్టు 17న ప్రారంభమైన సీయూఈటీ ఫేజ్-4 పరీక్షలు, సాంకేతిక సమస్యల కారణంగా 13 ఎగ్జామ్ సెంటర్లలో వాయిదా పడ్డాయి. దీంతో పరీక్ష రాయలేని అభ్యర్థులకు ఆగస్టు 25న ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్ష వాయిదా పడ్డ 13 కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 8 సెంటర్లు, వారణాసిలో రెండు కేంద్రాల్లో పరీక్ష వాయిదా పడింది. ఇందులో ఐఐటీ బీహెచ్‌యూ సెంటర్ కూడా ఒకటి. ఇక, బీహార్, గయా, ఫరీదాబాద్‌లలో ఒక్కొ సెంటర్లలో పరీక్ష వాయిదా పడింది.

* సెంటర్ ఎంపిక కోసం పరీక్ష వాయిదా
నాలుగో దశలో పరీక్షకు హాజరయ్యే సుమారు 11,000 మంది అభ్యర్థులకు పరీక్షలు రద్దు చేశారు. వారి ఎంపిక చేసుకున్న నగరానికి అనుగుణంగా ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి పరీక్షను ఆగస్టు 30కి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Cuet, CUET 2022, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు