Home /News /jobs /

CUET 2022 IN A FEW DAYS KNOW EXACT SYLLABUS TRICKS TO GET SUCCESS FOR THE COLLEGE ENTRANCE EXAM GH SK

CUET 2022: మరికొన్ని రోజుల్లో CUET UG ఎగ్జామ్.. సిలబస్‌ ఇదే.. బెస్ట్ స్కోర్ కోసం ఈ టిప్స్ పాటించండి


(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. CUET 2022 జులై 15న ప్రారంభం కానుంది.

CUET 2022: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. CUET 2022 జులై 15న ప్రారంభం కానుంది. ఈ పరీక్షను మొదటిసారి నిర్వహిస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency). దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంవత్సరం 12వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు CUET UGకి హాజరు కానున్నారు. రాబోయే CUET 2022 ఎగ్జామ్ సిలబస్ పూర్తిగా 12వ తరగతి NCERT సిలబస్‌పై ఆధారపడి ఉంటుంది. 11వ తరగతి సిలబస్‌ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఉండవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ (యూజీసీ) చైర్మన్‌ ఎం జగదీష్‌ కుమార్‌ తెలిపారు.

CUET 2022లోని 27 డొమైన్ సబ్జెక్ట్‌లలో ఒక విద్యార్థి గరిష్టంగా ఆరు డొమైన్‌లను ఎంచుకోవచ్చు. ఫారెన్ లాంగ్వేజ్ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం లాంగ్వేజ్ స్పిసిఫిక్ పేపర్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, BHU, AMU వంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఈ పరీక్ష జరుగుతుంది.



CUET 2022లో బెస్ట్ స్కోర్ కోసం పాటించాల్సిన టిప్స్

స్టడీ ప్లానింగ్
మొత్తం సిలబస్‌ను అనేక విభాగాలుగా విభజించి, ఒక సమయంలో ఒక పార్ట్‌ను పూర్తిగా చదవండి. CUET పరీక్షకు సిద్ధమవుతున్నవారు ముందు సంబంధిత సిలబస్‌పై గ్రిప్ పెంచుకోవాలి. దీని ఆధారంగా స్టడీ ప్లాన్ రెడీ చేసుకోవాలి.

రివిజన్
పరీక్షకు కొన్ని రోజులు మాత్రమే టైమ్ ఉంది. అందువల్ల ప్రతి సబ్జెక్టుకు సమానంగా సమయం ఇవ్వాలి. ఇప్పటికే అధ్యయనం చేసిన టాపిక్స్‌ను రివిజన్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా టైమ్ తీసుకోండి.

IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు.. పోస్టులు, జీతం వివరాలు ఇవే


 ప్రిపరేషన్ లెవల్ టెస్ట్ చేయడం
సిలబస్‌ను కంప్లీట్ చేసిన తర్వాత, మోడల్ టెస్ట్ పేపర్‌ను సాల్వ్ చేయండి. ఇది మీ ప్రిపరేషన్ ఏ లెవల్‌లో ఉందో సూచిస్తుంది. అన్ని ప్రశ్నలను అటెమ్ట్ చేసేలా సిద్ధం అవ్వండి. మోడల్ టెస్ట్‌లలో తప్పులను సరిదిద్దుకుంటూ అన్ని కాన్సెప్ట్‌లను క్లియర్ చేయండి. ఫైనల్ టెస్ట్ కోసం టాపిక్స్ సిద్ధం చేయండి. ఇది మీ స్పీడ్‌ను పెంచుతుంది.

కాలేజీల గురించి సమాచారం సేకరించండి
పరీక్షకు సిద్ధమయ్యే ముందు ప్రవేశం కోసం ఏదైనా కాలేజీ, కోర్సును ఎంచుకోండి. ఇది CUETలో మునుపటి సంవత్సరం కట్-ఆఫ్, తప్పనిసరి మార్కుల గురించి ఒక ఆలోచనను ఇస్తుంది.

ఫుడ్‌ బాక్స్‌లో రెజ్యూమ్.. ప్రతి ఆఫీస్‌కూ డెలివరీ.. మంచి ఉద్యోగం కోసం నిరుద్యోగి కష్టాలు


CUET 2022 పరీక్ష విధానం

CUET (UG) 2022 ఎగ్జామ్‌లో సెక్షన్ IA, సెక్షన్ IB , సెక్షన్ II (డొమైన్-స్పెసిఫిక్ టాపిక్స్), సెక్షన్ III ( జనరల్ టెస్ట్) వంటి నాలుగు సెక్షన్లు ఉంటాయి. మొదటి మూడు సెక్షన్‌లలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. వీటి నుంచి కనీసం 40 ప్రశ్నలను ప్రయత్నించాలి. సెక్షన్ III లో 75 ప్రశ్నలు ఉంటాయి. వీటి నుంచి 60 ప్రశ్నలను ప్రయత్నించేలా ప్రిపరేషన్ ఉండాలి. మొదటి మూడు సెక్షన్లకు 45 నిమిషాల చొప్పున సమయం ఉంటుంది. జనరల్ టెస్ట్ సెక్షన్‌కు 60 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ ఎనలిటికల్ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒరియా, ఇంగ్లీషు వంటి 13 భాషలలో ఒకదాన్ని ఎగ్జామ్ రాసేందుకు ఎంచుకోవాల్సి ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Cuet, CUET 2022, EDUCATION

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు