Home /News /jobs /

CUET 2022 EXTENSION OF CUET APPLICATION PROCESS ONCE AGAIN FULL DETAILS ARE AS FOLLOWS GH EVK

CUET-2022: సీయూఈటీ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. దరఖాస్తు ప్రక్రియ మరోసారి పొడిగింపు.. వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CUET-2022 | జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఉమ్మడి ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-2022 కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియను పొడిగించింది.

ఇంకా చదవండి ...
జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఉమ్మడి ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-2022 కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియను పొడిగించింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు మే 6తో ముగియగా, తాజాగా మరోసారి పొడిగిస్తూ అధికారిక నోటీసు జారీ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.in ద్వారా మే 22 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు అదే రోజు రాత్రి 11.50 గంటల లోపు చెల్లించడానికి అవకాశం కల్పించింది.
ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్‌యూ, ఏఎంయూ, జామీయా వంటి దాదాపు 40 సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ ప్రక్రియను సీయూఈటీ-2022 స్కోర్ ఆధారంగా చేపట్టనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష జూలై మొదటి లేదా రెండో వారంలో ఎన్‌టీఏ నిర్వహించే అవకాశం ఉంది. అయితే పరీక్ష ఏ తేదీన నిర్వహించనున్నారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దరఖాస్తు ఫారం లో ఏమైనా సవరణలు చేయాలంటే అభ్యర్థులకు మే 25 నుంచి 31 వరకు అవకాశం కల్పించారు.

సీయూఈటీ-2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి వారంలోనే దాదాపు లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బీహార్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి అభ్యర్థులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 13 వరకు వచ్చిన సమాచారం మేరకు యూపీ నుంచి అత్యధికంగా 36,611, ఢిల్లీ నుంచి 23,418, బీహార్‌ నుంచి 12,275 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందుకు విరుద్ధంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి దరఖాస్తుల చాలా తక్కువ సంఖ్యలో వచ్చినట్లు సమాచారం.

CUET- 2022: అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీల నుంచి అందుకు సమానమైన దాంట్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఢిల్లీ యూనివర్సిటీ లో అడ్మిషన్ పొందాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

UGC NET 2022: యూజీసీ నెట్ 2022 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ప‌రీక్ష ఫీజుల్లో మార్పులు.. వివ‌రాలు

దరఖాస్తు విధానం
స్టెప్-1: CUET అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.inలో లాంగిన్ అవ్వాలి.
స్టెప్-2: హోమ్ పేజీలో అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి
స్టెప్-3: అవసరమైన వివరాలు నమోదు చేయాలి
స్టెప్-4: డాక్యుమెంట్లు అప్‌‌లోడ్ చేసి, పరీక్ష ఫీజు చెల్లించాలి
స్టెప్-5: భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ సేవ్ చేసుకోవాలి.

TSPSC Group-1: గ్రూప్‌-1 పోస్టులకు విశేష స్పంద‌న‌.. అప్లికేష‌న్ ప్రాసెస్‌లో ముఖ్య‌మైన వివ‌రాలు

పరీక్షా విధానం
సీయూఈటీ-2022ను నాలుగు భాగాలుగా విభజించారు. సెక్షన్ IA 13 లాంగ్వేజ్‌లు, సెక్షన్ IB 20 లాంగ్వేజ్‌లు, సెక్షన్ II- 27 డొమైన్- ప్రత్యేక టాపిక్‌లు, సెక్షన్ III- జనరల్ టెస్ట్ పై ప్రశ్నలు అడగనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒరియా, ఇంగ్లీషు ఇలా 13 భాషల్లో ఏదో ఒకదానిలో లాంగ్వేజ్ పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పాఠ్యాంశాల నుంచి సిలబస్ ఉండనుంది.
Published by:Sharath Chandra
First published:

Tags: Cuet, CUET 2022

తదుపరి వార్తలు