దేశవ్యాప్తంగా టాప్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం CUET నిర్వహించనున్నారు. CUET-2022 సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి (ఏప్రిల్ 2) ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( NTA) నిర్వహించనుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30వ తేదీని దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ప్రకటించారు.
ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ సహా అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలను CUET ఆధారంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జామియా హమ్‌దార్డ్, TISSతో సహా అనేక టాప్ కాలేజీలు సైతం CUET స్కోర్ ఆధారంగా విద్యార్థులకు ఆడ్మిషన్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి.
Job Openings: హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్
ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు CUET కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతేడాది 12వ తరగతి చదివిన విద్యార్థులకు ఈ సంవత్సరం కూడా ఆడ్మిషన్ తీసుకోవడానికి యూనివర్సిటీలు అనుమతి ఇస్తే.. అలాంటి విద్యార్థులు సైతం CUET ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హులు.
CUET 2022 కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా ..
CUET 2022 అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in ను సందర్శించాలి.
ఎంట్రన్స్ పరీక్ష దరఖాస్తు కోసం CUET 2022 లింక్‌ను క్లిక్ చేయండి
అప్లికేషన్ ఫారంలో అవసరమైన వివరాలు నమోదు చేసి.. ప్రక్రియ పూర్తి చేయండి
అప్లికేషన్ ఫీజును చెల్లించండి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా దరఖాస్తు ఫారంను సేవ్ చేయండి.
Jobs in AP: కర్నూలు జిల్లాలో కాంట్రాక్ట్ జాబ్స్.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
CUET 2022 దరఖాస్తుకు అవరసమైన పత్రాలు..
ప్రవేశపరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి 10వ తరగతి మార్క్‌షీట్, 12వ తరగతి మార్క్‌షీట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్, దరఖాస్తుదారుడి సంతకం, ఫోటో ID ఫ్రూప్ కోసం ఆధార్ కార్డ్, కేటగిరీ సర్టిఫికేట్( వర్తిస్తే) దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించాల్సి ఉంటుంది.
CUET 2022 పరీక్ష నమూనా
CUET 2022 పరీక్షను కంప్యూటర్ బేస్డ్ మోడ్‌లో నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నాపత్రం ఉండనుంది. ప్రవేశ పరీక్షను IA, IB, II, III అనే నాలుగు విభాగాలుగా విభజించారు. సెక్షన్ IAలో తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, పంజాబీ, తెలుగు, ఒరియా, గుజరాతీ, ఉర్దూ సహా మొత్తం 13 భాషలు ఉండనున్నాయి. ఒక్కొ విద్యార్థి ఇంగ్లీష్ , ఒక ప్రాంతీయ భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
Govt Jobs 2022: ఈసీఐఎల్‌లో 1,625 ఉద్యోగాలు.. వేతనం రూ.24,780.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
సెక్షన్ IBలో మొత్తం 19 లాంగ్వేజ్‌లు ఉండనున్నాయి. ఇందులో స్పానిష్, జర్మన్, నేపాలీ, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు కూడా ఉండనున్నాయి. విద్యార్థులు సెక్షన్ IA, IB జాబితాల నుండి గరిష్టంగా 3 భాషలను ఎంపిక చేసుకోవచ్చు.
విద్యార్థులు ఎంచుకున్న ప్రతి భాషలో మొత్తం 50 ప్రశ్నలకుగాను 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది . రీడింగ్ కాంప్రహెన్షన్ ద్వారా లాంగ్వేజ్‌ను టెస్ట్ చేయనున్నారు. ప్రతి లాంగ్వేజ్ పేపర్ రాయడానికి విద్యార్థులకు 45 నిమిషాల సమయం కేటాయించారు.
సెక్షన్ IIలో అకౌంటెన్సీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ వంటి 27 డొమైన్- ప్రత్యేక సబ్జెక్టులు ఉండనున్నాయి. ఇచ్చిన ఆప్షన్ ప్రకారం విద్యార్థులు గరిష్టంగా 6 సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. సెక్షన్ IIలో 50 ప్రశ్నల్లో 40 ప్రశ్నలను ప్రయత్నించాలి. ప్రతి డొమైన్‌కు పేపర్ కు 45 నిమిషాలు కేటాస్తారు.
సెక్షన్ IIIలో జనరల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు మొత్తం 75 ప్రశ్నలలో 60 ప్రశ్నలను ప్రయత్నించాలి. విద్యార్థులు పేపర్ రాయడానికి 60 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇందులో కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇతర సబ్జెక్టుల్లో సాధారణ పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉండనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Exams