హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CUET 2022: యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సెంట్రల్ యూనివర్సిటీల అడ్మిషన్స్.. షెడ్యూల్ చెక్ చేయండి..

CUET 2022: యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సెంట్రల్ యూనివర్సిటీల అడ్మిషన్స్.. షెడ్యూల్ చెక్ చేయండి..

CUET 2022: యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సెంట్రల్ యూనివర్సిటీల అడ్మిషన్స్.. షెడ్యూల్ చెక్ చేయండి..

CUET 2022: యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సెంట్రల్ యూనివర్సిటీల అడ్మిషన్స్.. షెడ్యూల్ చెక్ చేయండి..

సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్, వర్సిటీల షెడ్యూల్స్ వివరాలు పరిశీలిద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్(Central University Under Graduate) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(CUET)ను నిర్వహిస్తున్నారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు(Entrance Exam Results) ఇటీవల వెల్లడయ్యాయి. ఇందులో క్వాలిఫై అయినవారు యూనివర్సిటీల్లో అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. యూనివర్సిటీలు అడ్మిషన్ల(Admissions) కోసం మెరిట్ జాబితాను త్వరలో వెల్లడించనున్నాయి. ఈ క్రమంలో అడ్మిషన్ ప్రాసెస్, వర్సిటీల షెడ్యూల్స్ వివరాలు పరిశీలిద్దాం.

* మూడు దశల్లో అడ్మిషన్ ప్రక్రియ

సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.

ఫేజ్-1: సీయూఈటీ పాసైన అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించనున్నారు. ఇది సెప్టెంబరు 26న ముగుస్తుంది.

ఫేజ్-2: సీయూఈటీ పరీక్షకు దరఖాస్తు చేసుకుని, పరీక్షకు హాజరైన వారి కోసం(తక్కువ మెరిట్) ఈ దశలో అడ్మిషన్స్ కల్పించనున్నారు. ఈ ఫేజ్ అక్టోబర్ 7 వరకు కొనసాగుతుంది.

AP-TS Postal GDS Results: పోస్టల్ జీడీఎస్ ఫలితాలు.. ఐదో లిస్ట్ ను ప్రకటించిన అధికారులు..

ఫేజ్-3: సీయూఈటీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోని వారందరికీ ఈ దశలో అడ్మిషన్స్ కల్పించనున్నారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 20న ముగుస్తుంది.

ఇప్పటికే చాలా సెంట్రల్ యూనివర్సిటీలు తమ కౌన్సెలింగ్ ప్రక్రియ వివరాలను వెల్లడించాయి. ఆ వివరాలు..

* హైదరాబాద్ యూనివర్సిటీ

ఈ యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 5గా నిర్ణయించారు. mgahvcuet.samarth.edu.in వెబ్‌సైట్ ద్వారా మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. నవంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

* బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ

ఈ యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సుల వారీగా మెరిట్ జాబితాను కమిటీ తయారు చేస్తుంది. మొదటి రౌండ్ మెరిట్ జాబితా అక్టోబర్ 10న ప్రకటిస్తుంది. విద్యార్థులు సంబంధిత కోర్సులో అడ్మిషన్ పొందేందుకు అవసరమైన ఫీజులను అక్టోబర్ 15 నాటికి చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించి రెండో రౌండ్ కౌన్సెలింగ్ అక్టోబర్ 17 నుంచి 31 మధ్య జరుగుతుంది.

Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

* అలహాబాద్ యూనివర్సిటీ

అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 11 నుంచి నవంబర్ 4 వరకు జరుగుతుంది. అకడమిక్ సెషన్ నవంబర్ 10 నుంచి ప్రారంభం కానుంది.

* ఢిల్లీ యూనివర్సిటీ

ఢిల్లీ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రక్రియ కోసం కామన్ సీట్ అలొకేషన్ సిస్టమ్(CSAS)ను ఏర్పాటు చేసింది. మొదటి దశ అడ్మిషన్ ప్రక్రియ అక్టోబర్ 10తో ముగుస్తుంది. రెండో దశ సెప్టెంబర్ 26 -అక్టోబర్ 10 వరకు జరుగుతుంది. ఇక మెరిట్ జాబితాలను అక్టోబర్ 10 నాటికి వెల్లడి చేయనుంది.

* పాండిచ్చేరి యూనివర్సిటీ

అక్టోబరు 6న మొదటి మెరిట్ జాబితా విడుదల చేయనుంది. రెండో మెరిట్ జాబితా అక్టోబర్ 11న, మూడోది అక్టోబర్ 14న విడుదల చేయనుంది. అక్టోబర్ 17 నుంచి అకడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది.

* జామియా మిలియా ఇస్లామియా

సీయూఈటీ రిజల్ట్స్ ఆధారంగా పది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ వర్సిటీ మొదటి మెరిట్ జాబితాను సెప్టెంబర్ 26న రిలీజ్ చేయనుంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు అభ్యర్థులు అడ్మిషన్స్ పొందవచ్చు. రెండో మెరిట్ జాబితా అక్టోబరు 6న ప్రకటించనుంది. అడ్మిషన్లు అక్టోబర్ 10- 12 మధ్య జరుగుతాయి. మూడో మెరిట్ జాబితా అక్టోబర్ 17 లోపు విడుదల అవుతుంది. అడ్మిషన్లు అక్టోబర్ 20- 21 వరకు జరగనున్నాయి.

Published by:Veera Babu
First published:

Tags: Cucet, CUCET 2022, Cuet, CUET 2022

ఉత్తమ కథలు