Home /News /jobs /

CUCET 2022 HERE IS THE IMPORTANT TIPS FOR ASPIRANTS TO GET GOOD SCORE NS GNT

CUCET 2022 Exam Tips: సీయూసెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారికి అలర్ట్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CUCET భారతదేశం లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు మరియు అన్ని విశ్వవిద్యాలయాల లో చదువుకునేందుకు నిర్వహించే అర్హత పరీక్ష. ఈ పరీక్ష (Exam) కు ఇంటర్ మరియు సీబీఎస్సీ పన్నెండోవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు అర్హులు.

    (Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati)
    CUCET భారతదేశం లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు మరియు అన్ని విశ్వవిద్యాలయాల లో చదువుకునేందుకు నిర్వహించే అర్హత పరీక్ష (Entrance Exam). ఈ పరీక్ష కు ఇంటర్ మరియు సీబీఎస్సీ (CBSE) పన్నెండోవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు అర్హులు. ఈ పరీక్ష ఆన్లైన్ విధానం లో నిర్వహిస్తారు .2  విభాగాలుగా పరీక్ష ఉంటుంది మొదటి విభాగం మూడు గంటల పదిహేను నిముషాలు రెండవ విభాగం రెండు గంటల పదిహేను నిమిషాల సమయం ఉంటుంది. ఈ పరీక్ష బిట్స్ రూపంలో ఉంటుంది. CUCET కి ఇంటర్ లోని  ఆరు సబ్జెక్టు ల తో పాటు జనరల్ టెస్ట్ ఉంటుంది. ఈ జనరల్ టెస్ట్ లో జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, కాంపిటేటివ్ రీజనింగ్స్, లాజికల్ మరియు ఎనలిటికల్ రీజనింగ్స్ గురించి ప్రశ్నలు ఉంటాయి. అయితే, జనరల్ టెస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ జనరల్ టెస్ట్ రాయడం వలన భారత దేశం లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో చేరేందుకు అర్హత సాధించే క్రమం లో జనరల్ టెస్ట్ మర్క్స్ బాగా ఉపయోగపడుతాయి.

    మొదటి విభాగంలో మూడు సబ్జెక్టు లకు మరియు జనరల్ టెస్ట్ ఉంటుంది. జనరల్ టెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్టు కు యాబై ప్రశ్నలు ఉంటాయి. వాటిలో నలబై ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కొక్క సబ్జెక్టు కు సమయం నలబై ఐదు నిమిషాల సమయం ఉంటుంది. సరైన సమాధానం రాసిన ప్రశ్నకు ఐదు మార్కులు, తప్పు సమాధానం వ్రాసిన ప్రశ్నకు ఒక మార్క్ మైనస్ చేస్తారు. మూడు సబ్జెక్టు లకు ఒక్కొక్క పేపర్ కు నలబై ఐదు నిమిషాల సమయం ఉంటుంది. ఒకదాని తర్వాత మరొక సబ్జెక్టు పేపర్ ఓపెన్ అవుతుంది. మొత్తం పరీక్ష రెండు గంటల పదిహేను నిముషాలు సమయం జనరల్ టెస్ట్ ఎంచుకున్నట్లైతే మరో గంట సమయం అదనం గా లభిస్తుంది.
    CUET Exam Tips: CUET పరీక్ష రాసే అభ్యర్థులకు సూచన.. ఇవి తెలుసుకుంటే CUET పరీక్షలో విజ‌యం మీదే!



    నెగిటివ్ మార్కు ఉంది కాబట్టి  విద్యార్థులు అలోచించి జాగ్రత్తగా సమాధానములు పెట్టవలెను. రెండవ విభాగం లో మూడు సబ్జెక్టులకు ఒక్కొక్క సబ్జెక్టు కు యాబై ప్రశ్నలు ఉంటాయి. వాటిలో నలబై ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కొక్క సబ్జెక్టు కు సమయం నలబై ఐదు నిముషాల సమయం ఉంటుంది. సరి అయిన సమాధానం రాసిన ప్రశ్నకు ఐదు మార్కులు, తప్పు సమాధానం వ్రాసిన ప్రశ్నకు ఒక మార్క్ మైనస్ చేస్తారు. మొత్తం పరీక్ష రెండు గంటల పదిహేను నిముషాలు సమయం ఉంటుంది. నెగిటివ్ మార్కు ఉంది కాబట్టి  విద్యార్థులు అలోచించి జాగ్రత్తగా సమాధానములు రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు సమయపాలన పాటించి పరీక్ష రాయాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, CUCET 2022, Exam Tips, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు