CTET JULY NOTIFICATION 2022 RELEASED AND MAJOR CHANGES INTRODUCED IN TEACHER ELIGIBILITY EXAMS THIS YEAR UMG GH
C-TET 2022: త్వరలో సీ-టెట్ నోటిఫికేషన్.. ఈసారి ఎగ్జామ్‌లో కొత్తగా రానున్న మార్పులు ఇవే..!
సీ టెట్ నోటిఫికేషన్లో కొత్తగా వచ్చే మార్పులు ఇవే..!
ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకున్న వారి కోసం సీబీఎస్ఈ ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET )ను నిర్వహిస్తుంది. అయితే ఈసారి పరీక్షలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం.
ఉపాధ్యాయ వృత్తిని (Teacher) ఎంచుకోవాలనుకున్న వారి కోసం సీబీఎస్ఈ ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET )ను నిర్వహిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ (Notification) వచ్చే వారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ctet.nic.in వెబ్సైట్ (Website)లో నోటిఫికేషన్ అందుబాటులోకి రానుంది. సీ-టెట్‌కు ప్రతి సంవత్సరం 20 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయి. గతేడాది సీ-టెట్‌కు 27.73 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా, 6.65 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 4,45,467 మంది పేపర్ Iను.. మరో 2,20,069 మంది అభ్యర్థులు పేపర్ II ను క్లియర్ చేశారు. గతేడాది మాదిరి ఈసారి కూడా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను ఆన్ లైన్లో నిర్వహించనున్నారు. అయితే ఈసారి పరీక్షలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం.
* సర్టిఫికేట్ వ్యాలిడిటీ
సీ-టెట్ ఒకసారి క్లియర్ చేస్తే, అభ్యర్థులు తమ జీవితంలో ఏ సమయంలోనైనా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ సర్టిఫికేట్ ఇప్పుడు జీవితకాలం చెల్లుబాటుకానుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. సగటున 50% మంది అభ్యర్థులు సీ-టెట్‌లో అర్హత సాధిస్తారు. కాగా, గతంలో సర్టిఫికేట్ ఏడేళ్ల కాలానికి మాత్రమే చెల్లుబాటు అయ్యేది. ఆ తరువాత అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చేది.
* పరీక్ష విధానం
సీ-టెట్ 2022ను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. కాగా, మొదటిసారి సీ టెట్‌ను ఆన్లైన్లో చేపట్టినప్పుడు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు సాంకేతిక లోపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వివిధ షిఫ్ట్‌ల్లో జరగాల్సిన పరీక్షలను రద్దు చేశారు. అయినప్పటికీ, సీబీఎస్ఈ ఆన్లైన్ మోడ్‌తో ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
* సిలబస్
ఆన్లైన్ పరీక్షలకు సరిపోయే విధంగా సీబీఎస్ఈ గతేడాది సీ-టెట్ సిలబస్‌ను కూడా మార్చింది. ఈ సంవత్సరం కూడా దీన్నే అనుసరించే అవకాశం ఉంది. సిలబస్‌లో మార్పులు చేసినప్పుడు సీబీఎస్ఈ ఇలా పేర్కొంది. “కంటెంట్, బోధనా పరంగా మెరుగైన ఎగ్జామ్ మెటీరియల్ అందించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేశాం. సబ్జెక్టు బోధనపై అవగాహనను అంచనా వేసుకోవడానికి ఈ సవరించిన సిలబస్ సహాయపడుతుంది.’’ అని వెల్లడించింది.
సీ- టెట్‌ను 1 నుంచి 8 తరగతి వరకు బోధించడానికి ఇష్టపడే వారి కోసం నిర్వహిస్తారు. పేపర్ -1 క్లియర్ చేస్తే 1 నుంచి 6 తరగతుల వరకు బోధించవచ్చు. పేపర్ -2 క్లియర్ చేసిన వారు 6 నుంచి 8 తరగతుల వరకు బోధించడానికి అవకాశం ఉంటుంది.
ప్రతి పేపర్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో 150 ఉంటాయి. లాంగ్వేజ్ పేపర్ల కోసం, అభ్యర్థులు రెండు వేర్వేరు లాంగ్వేజ్ లను ఎంచుకోవాలి. హిందీ, ఇంగ్లీషు సహా 20 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. సీ-టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలంటే 55 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.