CTET Result : దేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ విద్యాలయాల్లో, నేవీ తదితర స్కూల్స్‌లో టీచర్ల భర్తీకి కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రాథమికంగా సీటెట్ పరీక్ష నిర్వహిస్తుంది. ఏడాదికి రెండుసార్లు Central Teacher Eligibility Test(CTET) జరుగుతుంది. ప్రాథమిక, ఉన్నత తరగతులకు బోధించే వారి కోసం వేర్వేరు పేపర్లు ఉంటాయి. CTET- 2023కు సంబంధించిన పరీక్షను గతేడాది డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7 వరకు దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో నిర్వహించారు. ఈ ఎగ్జామ్ ఫలితాలకు సంబంధించి CBSE(Central Board Secondary Education) నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫలితాలు ఎప్పుడంటే?
ఎగ్జామ్స్ పూర్తయిన వెంటనే CTET- 2023 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేశారు. అందులో ఎవరికైనా అభ్యంతరాలుంటే దానికి సంబంధించిన అభ్యర్థనలను ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు తీసుకున్నారు. ఈ గడువు ముగిసి నాలుగు రోజులు అయిన నేపథ్యంలో ఫలితాలు ఎప్పుడొస్తాయా? అని అభ్యర్థులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలను ఈ వారంలోనే ప్రకటించనున్నట్లు సీబీఎస్‌ఈ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
Machine Learning: మెషీన్ లెర్నింగ్ వర్చువల్ ఇంటర్న్‌షిప్‌కు అవకాశం.. అర్హత, ఇతర వివరాలిలా
మార్కింగ్ స్కీమ్
1 నుంచి 5 తరగతుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అప్లై చేసే వారికి పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయు పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసేవారికి పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్ష పత్రాల్లోనూ 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ఒక్క ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. సరైన సమాధానానికి ఒక మార్కు వస్తే, తప్పు సమాధానానికి ఒక మార్కె మైనస్ అవుతుంది. ప్రాథమిక కీకి సంబంధించి అందరి నుంచి స్వీకరించిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని బోర్డు ఫైనల్ కీ సిద్ధం చేస్తుంది. దాని ప్రకారం రిజల్స్ విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో పునఃపరిశీలనకు గానీ, ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు గానీ అవకాశం ఉండదు. CTET 2023 పరీక్షకు సంబంధించి కేటగిరీ బట్టి మార్కులు మారుతాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం మార్కులు రావాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించాలి.
CTET 2023 ఫలితాలు ఎలా తెలుసుకోవాలి?
ముందుగా CTET అధికారి వెబ్‌సైట్ ctet.nic.inలోకి వెళ్లండి. హోమ్ పేజీలోని CTET ఫలితం 2023 లింక్‌పై క్లిక్ చేయండి. లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలు ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రిజల్ట్ డిస్‌ప్లే అవుతుంది. దాన్ని ప్రింట్ అవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.