హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CTET 2022: ఓపెన్‌ అయిన సీటెట్-2022 కరెక్షన్ విండో.. అప్లికేషన్‌లో ఛేంజెస్‌ చేసుకునే అవకాశం..

CTET 2022: ఓపెన్‌ అయిన సీటెట్-2022 కరెక్షన్ విండో.. అప్లికేషన్‌లో ఛేంజెస్‌ చేసుకునే అవకాశం..

CTET 2022: ఓపెన్‌ అయిన సీటెట్-2022 కరెక్షన్ విండో.. అప్లికేషన్‌లో ఛేంజెస్‌ చేసుకునే అవకాశం..

CTET 2022: ఓపెన్‌ అయిన సీటెట్-2022 కరెక్షన్ విండో.. అప్లికేషన్‌లో ఛేంజెస్‌ చేసుకునే అవకాశం..

సీటెట్-2022 పరీక్ష డిసెంబర్-జనవరి మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో జరగనుంది. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ కూడా నవంబర్ 24తో ముగిసిపోయింది. దరఖాస్తు ఫారమ్‌లో ఏమైనా మార్పులు చేయాలంటే అందుకు సీబీఎస్‌ఈ తాజాగా అవకాశం కల్పించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

టీచింగ్‌ను కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకుంటున్న వారి కోసం ఏటా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET)ను నిర్వహిస్తుంది. సీటెట్-2022 పరీక్ష డిసెంబర్-జనవరి మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో జరగనుంది. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ కూడా నవంబర్ 24తో ముగిసిపోయింది. దరఖాస్తు ఫారమ్‌లో ఏమైనా మార్పులు చేయాలంటే అందుకు సీబీఎస్‌ఈ తాజాగా అవకాశం కల్పించింది. ఈ మేరకు కరెక్షన్ లింక్‌ను యాక్టివేట్ చేసింది. దీంతో కరెక్షన్ చేయాలనుకుంటున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ద్వారా దరఖాస్తు ఫారమ్‌లలో మార్పులు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలంటే ముందుగా అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాంగిన్ అవ్వాల్సి ఉంటుంది.

* కరెక్షన్ చేయడానికి అనుసరించాల్సిన విధానం

ముందుగా సీటెట్ ఆన్‌లైన్ పోర్టల్‌ ctet.nic.inను ఓపెన్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న కరెక్షన్ విండో లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఒక కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత సీటెట్-2022 దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన మార్పులను చేయాలి. చివరగా అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

* డిసెంబర్ 3 వరకు అవకాశం

సీబీఎస్‌ఈ సీటెట్-2022 అప్లికేషన్‌లో కరెక్షన్ చేయడానికి డిసెంబర్ 3 వరకు అవకాశం కల్పించింది. ఆ తరువాత దరఖాస్తుల ఎడిటింగ్ సంబంధించిన అభ్యర్థనలు సీబీఎస్ఈ ఎట్టి పరిస్థితిలో స్వీకరించదు. అభ్యర్థులు ఎగ్జామ్‌నేషన్ సిటీని కూడా మార్చుకోవచ్చు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న సిటీలో స్లాట్స్ అందుబాటులో ఉంటేనే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సౌకర్యం ఫస్ట్-కమ్, ఫస్ట్ సర్వ్‌ బేసిస్ ఆధారంగా ఉంటుంది.

* ఎగ్జామ్ ప్యాట్రన్

సీ-టెట్ పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో జరగనుంది. సీ-టెట్ ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ కేటాయించనున్నారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉండదు. సీ-టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-2‌ రాయాలి. రెండు పేపర్లకూ అభ్యర్థులు హాజరుకావచ్చు.

KVS Recruitment 2022: గుడ్ న్యూస్.. 6,414 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ..

* సర్టిఫికెట్ వ్యాలిడిటీ

సీ-టెట్ ఒకసారి క్లియర్ చేస్తే, అభ్యర్థులు తమ జీవితంలో ఏ సమయంలోనైనా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ సర్టిఫికెట్ ఇప్పుడు జీవితకాలం చెల్లుబాటుకానుంది. గతంలో సర్టిఫికెట్ ఏడేళ్ల కాలానికి మాత్రమే చెల్లుబాటు అయ్యేది. సీటెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు. ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్(KVS), నవోదయ విద్యాలయ సమితి(NVS), ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(DSSSB), ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(ERDO) లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలను పొందొవచ్చు.

First published:

Tags: Ctet, JOBS