హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CTET 2022: త్వరలోనే సీటెట్​ 2022 నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు విధానం ఇలా..

CTET 2022: త్వరలోనే సీటెట్​ 2022 నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు విధానం ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉపాధ్యాయవృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) నిర్వహిస్తోంది.

ఉపాధ్యాయవృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) నిర్వహిస్తోంది. త్వరలోనే 2022 ఏడాదికి సంబంధించిన సీటెట్​ నోటిఫికేషన్​ విడుదల కానుంది. బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత, అధికారిక వెబ్‌సైట్ www.ctet.nic.in లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పరీక్షను జూలైలో నిర్వహించే అవకాశం ఉంది. అయితే, పరీక్ష తేదీలపై త్వరలోనే స్పష్టత రానుంది. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్​ 1 నుండి 5 తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ 6 నుండి 9 తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు.

సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. గతంలో ఈ స్కోర్​ కేవలం ఏడేళ్లపాటు మాత్రమే చెల్లుబాటయ్యేది. ఈ పరీక్షను హిందీ, ఇంగ్లీషుతో సహా 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సెంట్రల్ టిబెటన్ పాఠశాలలు వంటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో టీచర్ల రిక్రూట్​మెంట్​కు పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో సైతం టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

SIDBI recruitment 2022: రూ.70,000 వేతనంతో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్... డిగ్రీ పాసైతే చాలు

సీటెట్ 2022 అర్హత ప్రమాణాలు

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు సీటెట్​ పేపర్​ 1 రాయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వారి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (BElEd) ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు చివరి ఏడాదిలో ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక, సీనియర్ తరగతులకు బోధించడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా ప్రాథమిక విద్యలో రెండేళ్ల డిప్లొమా లేదా ఏడాది బీఈడీ లేదా నాలుగు సంవత్సరాల బీఎడ్​ ఉత్తీర్ణులై ఉండాలి.

కావాల్సిన డాక్యుమెంట్లు

పదో తరగతి పాస్ సర్టిఫికేట్

ఇంటర్మీడియట్​ పాస్ సర్టిఫికేట్

బీఈడీ పాస్​ సర్టిఫికేట్

ఆధార్ లేదా ఓటరు కార్డు

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్డ్​ కాపీ

సిగ్నేచర్​ స్కాన్డ్​ కాపీ

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

సీటెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

హోమ్‌పేజీలో సీటెట్​ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసుకోండి. రిజిస్ట్రేషన్ నంబర్‌ను సేవ్ చేయండి.

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

ఎగ్జామ్​ ఫీజు చెల్లించండి. దరఖాస్తు ఫారమ్​ను సబ్​మిట్​ చేయండి.

దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేసుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Ctet, Students

ఉత్తమ కథలు