CTET 2022 NOTIFICATION SOON KNOW HOW MANY TIMES CAN YOU ATTEMPT TEACHER ELIGIBILITY EXAM AND KNOW HOW TO APPLY GH VB
C-TET 2022: త్వరలో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్.. అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలు..
ప్రతీకాత్మక చిత్రం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్వరలో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)- 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్ఈ నిర్వహిస్తుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్వరలో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)- 2022 నోటిఫికేషన్‌ను(Notification) విడుదల చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం(Every Year) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్ఈ(CBSE) నిర్వహిస్తుంది. నోటిఫికేషన్ జూలైలో విడుదల అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ctet.nic.in వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది.
అర్హత ప్రమాణాలు
C-TET 2022కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందాలంటే, అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (BElEd)లో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. 6వ తరగతి నుంచి 9 తరగతుల వరకు బోధించాలనుకునే వారు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్‌తో పాటు ప్రాథమిక విద్యలో రెండేళ్ల డిప్లొమా లేదా ఒక సంవత్సరం BEd లేదా నాలుగు సంవత్సరాల BElEdలో ఉత్తీర్ణులై ఉండాలి. KVS, NVS, సెంట్రల్ టిబెటన్ పాఠశాలలు వంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో దరఖాస్తు చేయడానికి C-TET స్కోర్ ఉపయోగపడనుంది.
బోధించడానికి సిద్ధంగా ఉన్నవారు ఉద్యోగం కోసం పరిగణలోకి తీసుకోవాలంటే పరీక్షలో కనీసం 50 పర్సంటైల్ స్కోర్‌ను సాధించాలి. అదేవిధంగా టీచింగ్ కోసం ఎంపిక చేసుకున్న నిర్దిష్ట పాఠశాలల ప్రమాణాలను కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది.
జీవితకాలం చెల్లుబాటు
గతంలో సీ-టెట్ ఏడేళ్ల వరకు వ్యాలిడిటీలో ఉండేది. ఆ తరువాత అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం C-TET సర్టిఫికేట్(పరీక్షలో ఉత్తీర్ణత పొందినప్పుడు ఇస్తారు) జీవితకాలం చెల్లుబాటు కానుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎవరైనా ఎన్నిసార్లైనా పరీక్ష రాయడానికి అవకాశం ఉంది.
వయోపరిమితి
C-TET పరీక్ష కోసం గరిష్ట వయోపరిమితి నిబంధనలు లేవు. ఫలితంతో అభ్యర్థులు సంతృప్తి చెందకపోతే పరీక్షకు మళ్లీ హాజరుకావచ్చు. తద్వారా స్కోర్‌ను మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లైనా పరీక్షకు హాజరు కావచ్చు.
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో బోధించడానికి అర్హులుగా పరిగణిస్తారు. అంతేకాకుండా వారికి జీవితకాలం చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయుల పోస్ట్ కోసం వివిధ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ సర్టిఫికేట్‌ను ఉపయోగించుకోవచ్చు. కాగా, గతంలో ఈ సర్టిఫికెట్ ఏడేళ్లపాటు చెల్లుబాటయ్యేది.
20 భాషల్లో నిర్వహణ
C- TET సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. ఇది రెండు లెవెల్స్ లో జరుగుతుంది. 1 నుంచి 5 తరగతి వరకు టీచింగ్ చెప్పాలనుకునే వారు పేపర్ 1కు హాజరు కావాలి. అదే 6 నుంచి 8వ తరగతులకు వరకు భోదించాలనుకుంటే పేపర్ 2కు హాజరుకావాలి. హిందీ, ఇంగ్లిష్తో సహా మొత్తం 20 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.