Home /News /jobs /

CTET 2022 ARE YOU APPLYING FOR CTET THEN LEARN ABOUT EXAM PROCEDURE AND PASSING MARKS DETAILS GH EVK

CTET 2022: సీటెట్‌కు అప్లై చేస్తున్నారా? పరీక్ష విధానం, పాసింగ్ మార్క్స్ వంటి వివరాలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CTET 2022 | జూలై అట్టెంప్ట్‌కు సంబంధించిన కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్వరలోనే విడుదల చేయనుంది. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫారమ్‌ (Applications Forms)లు కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
జూలై అట్టెంప్ట్‌కు సంబంధించిన కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET 2022) నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్వరలోనే విడుదల చేయనుంది. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫారమ్‌ (Applications Forms)లు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ctet.nic.inలో సీటెట్‌ (CTET) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సీటెట్‌ (Central Teacher Eligibility Test)ను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 1-5 తరగతులకు ఉపాధ్యాయులు కావాలంటే పేపర్ 1కి హాజరుకావాలి, 6 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయులు కావాలంటే పేపర్ 2కి హాజరు కావాలి. సీటెట్‌ స్కోర్‌కు ఇప్పుడు జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. ఇంతకుముందు ఈ స్కోరు కేవలం ఏడేళ్లపాటు చెల్లుబాటయ్యేది. పరీక్ష హిందీ, ఇంగ్లీషుతో సహా 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్‌ నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో కొన్ని ముఖ్య విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Layoff Season Continues: టెక్కీల‌కు షాక్‌.. ఒక్క నెల‌లో 15,000 మంది ఉద్యోగుల తొల‌గింపు


అర్హత ప్రమాణాలు
సీటెట్‌ 2022కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలానే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (BElEd) చివరి సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా హాజరు అవుతుండాలి. 6 నుంచి 9 తరగతుల టీచింగ్ కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా ఒక సంవత్సరం BEd లేదా నాలుగు సంవత్సరాల BElEdతో గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి.

ఉత్తీర్ణత మార్కులు
అన్‌రిజర్వ్డ్‌ (UR) కేటగిరీ అభ్యర్థులు సీటెట్‌ 2022లో అర్హత సాధించాలంటే కనీసం 60 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఎస్‌సీ(SC), ఎస్‌టీ(ST), ఓబీసీ (OBC) అభ్యర్థులు కనీసం 55 శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది.

TS Police Jobs: అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఆ జిల్లాల్లో అధిక పోటీ

కేవలం పరీక్షలో అర్హత సాధించినంత మాత్రాన డైరెక్ట్‌గా రిక్రూట్ చేస్తారని అనుకోకూడదు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవాలి.. ఆపై ఇన్‌స్టిట్యూట్‌ల ప్రకారం తదుపరి విధానాలను అనుసరించాలి.

పరీక్ష విధానం
పరీక్షలో పేపర్-I, పేపర్ II అనే రెండు పేపర్లు ఉంటాయి. 2021 నుంచి సీటెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌ కండక్ట్ చేస్తున్నారు. మొదటి ఆన్‌లైన్ సీటెట్‌లో అవాంతరాలు ఎదురైనప్పటికీ, అది అలాగే కొనసాగే అవకాశం ఉంది. 1 నుంచి 5 తరగతులకు బోధించాలనుకునే వారికి పేపర్ I ఉండే ఆన్‌లైన్ మోడ్‌లో విద్యా విధానం అలాగే ఉంటుంది. ఈ పరీక్షలో పిల్లల అభివృద్ధి & బోధనాశాస్త్రం (Child Development And Pedagogy), లాంగ్వేజ్ I & II, గణితశాస్త్రం, పర్యావరణం వంటి ఒక్కో సబ్జెక్టు నుంచి 30 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు అడుగుతారు.

Telangana Exams: తెలంగాణ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. పరీక్ష ద‌ర‌ఖాస్తుకు ఈ రోజే ఆఖ‌రు

సీటెట్‌ స్కోర్ ఎక్కడ వర్తిస్తుంది?
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS), సెంట్రల్ టిబెటన్ పాఠశాలలకు సీటెట్‌ స్కోర్ వర్తిస్తుంది. అలానే చండీగఢ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, అండమాన్, నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల ఆధ్వర్యంలోని పాఠశాలలకు కూడా స్కోర్ వర్తిస్తుంది. లక్షద్వీప్, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని పాఠశాలలకు కూడా ఈ స్కోరు ఉపయోగపడుతుంది. అభ్యర్థులు అన్-ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీనియర్ తరగతులకు బోధించడానికి ఇష్టపడే వారు పేపర్ II రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ప్రశ్నపత్రంలో పిల్లల అభివృద్ధి, బోధనాశాస్త్రం, భాష I, II వంటి ఒక్కో సబ్జెక్ట్ నుంచి 30 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు, గణితం, సైన్స్ లేదా సామాజిక అధ్యయనాలు/శాస్త్రాల నుండి 60 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు మొత్తం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు సంఖ్య 150. అభ్యర్థులు రెండు వేర్వేరు భాషలను ఎంచుకోవాలి.

సీటెట్‌ 2021లో పరీక్ష జనవరి, డిసెంబర్‌లలో రెండు సెషన్‌లలో జరిగింది. మొదటి సెషన్‌లో పేపర్ 1లో 4.14 లక్షల మందికి 1.47 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ IIలో, 11 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకున్నారు, అందులో కేవలం 2.29 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. డిసెంబర్ ప్రయత్నంలో 27.73 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు, వారిలో 4,45,467 మంది అభ్యర్థులు పేపర్ I ని, 2,20,069 మంది పేపర్ II క్లియర్ చేశారు.
Published by:Sharath Chandra
First published:

Tags: Career and Courses, Ctet, EDUCATION, Exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు