CTET 2022: టీచింగ్‌ను కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకుంటున్న వారి కోసం ఏటా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET)ను నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ద్వారా నవంబర్ 24 లోపు అప్లై చేసుకోవచ్చు. సీటెట్-2022 పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో జరగనుంది. సీటెట్ అప్లికేషన్స్ ప్రాసెస్, అవసరమైన డాక్యుమెంట్లు, ఇతర వివరాలు చెక్ చేద్దాం.
ఎలా అప్లై చేయాలి..?
అభ్యర్థులు సీటెట్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ఓపెన్ చేసి, సీటెట్-2022 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫారమ్‌ను ఫిల్ చేసి, స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫీజు చెల్లించి, అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం అభ్యర్థులు తమ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది.
అప్లికేషన్ ఫీజు
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్ష ద్వారా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పాఠాలు బోధించడానికి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇక, పేపర్ -2 ద్వారా 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించడానికి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జనరల్, ఓబీసీ కేటగిరి అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.1,200 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రిజర్వ్‌డ్ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600 ఫీజు చెల్లించాలి. నవంబర్ 25 మధ్యాహ్నం 3.30 గంటల లోపు ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు.
రోజూ వైన్ షాపుకి వెళ్లి మందు కొడుతున్న కోతి.. బాటిల్ ఇవ్వకుంటే రచ్చ రంభోలా
అవసరమయ్యే డాక్యుమెంట్లు
సీటెట్-2022 పరీక్షకు అప్లై చేసే అభ్యర్థులు.. చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్, పాస్‌పోర్ట్/ఆధార్/ఓటర్ ఐడీ/రేషన్ కార్డ్ వంటి ఐడెంటిటీ ఫ్రూఫ్ వివరాలు, స్పెసిఫైడ్ ఫార్మాట్‌లో అభ్యర్థి ఫొటో, సంతకానికి సంబంధించిన స్కాన్ కాపీ, 10వ తరగతి- ఇంటర్ సర్టిఫికెట్స్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి.
సర్టిఫికేట్ వ్యాలిడిటీ
సీ-టెట్ ఎగ్జామ్‌ను ఒకసారి క్లియర్ చేస్తే, అభ్యర్థులు తమ జీవితంలో ఏ సమయంలోనైనా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ సర్టిఫికేట్ ఇప్పుడు జీవితకాలం చెల్లుబాటుకానుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. సగటున 50% మంది అభ్యర్థులు సీ-టెట్‌లో అర్హత సాధిస్తారు. కాగా, గతంలో సర్టిఫికేట్ ఏడేళ్ల కాలానికి మాత్రమే చెల్లుబాటు అయ్యేది. ఆ తరువాత అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చేది. ఎగ్జామ్ క్లియర్ చేసినవారు.. కేంద్రీయ విద్యాలయ సంఘటన్(KVS), నవోదయ విద్యాలయ సమితి(NVS), ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(DSSSB), ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(ERDO) లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలను పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ctet