హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CTET 2021 : సీటెట్ 2021 రిజిస్ట్రేష‌న్‌ గ‌డువు పొడ‌గింపు.. ద‌రఖాస్తు విధానం

CTET 2021 : సీటెట్ 2021 రిజిస్ట్రేష‌న్‌ గ‌డువు పొడ‌గింపు.. ద‌రఖాస్తు విధానం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఉపాధ్యాయవృత్తిని చేపట్టాలనుకునేవారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-CTET నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సీటెట్ ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. ఈ ప‌రీక్ష ద‌ర‌ఖాస్తు గ‌డువును అక్టోబ‌ర్ 25, 2021 వ‌ర‌కు పెంచుతూ సీబీఎస్‌సీ నిర్ణ‌యం తీసుకొంది.

ఇంకా చదవండి ...

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ CTET-2021 రిజిస్ట్రేషన్‌ల కోసం చివరి తేదీని అక్టోబర్ 25 వరకు పొడిగించింది. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఇప్పుడు అక్టోబర్ 26, మధ్యాహ్నం 3.30 గంటల వరకు. ఆసక్తి గల అభ్యర్థులు ctet.nic.in లో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ‌తంతో CTET 2021 దరఖాస్తు ప్రక్రియ ఈరోజు, అక్టోబర్ 20తో ముగియ‌నుండ‌గా సీబీఎస్ఈ ఈ నిర్ణ‌యం తీసుకొంది. ఉపాధ్యాయవృత్తిని చేపట్టాలనుకునేవారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-CTET నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సీటెట్ ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేష‌న్‌లో ఇప్ప‌టికే విడుద‌ల అయ్యింది.

ముఖ్యమైన తేదీలు..

అప్లికేషన్ ప్రారంభంసెప్టెంబర్ 20, 2021
దరఖాస్తుకు  ఆఖరు తేదీఅక్టోబర్ 25, 2021
ఈ-చలాన్ చెల్లింపునకు  చివరి తేదీఅక్టోబర్ 25, 2021
అడ్మిట్ కార్డులుడిసెంబర్ మొదటి వారం
పరీక్ష తేదీలుడిసెంబర్ 16, 2021 నుంచి జనవరి 13, 2022
ఫలితాలుఫిబ్రవరి 15, 2022


 SSC Recruitment 2021: రూ.85,500 వేతనంతో 3261 జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే


దరఖాస్తు చేసుకొనే విధానం..

Step 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్‌  https://ctet.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P ను సంద‌ర్శించాలి.

Step 2: అక్క‌డ ‘Apply Online’ పై క్లిక్ చేయండి

Step 3: రిజిస్ట‌ర్ నంబ‌ర్ జ‌న‌రేట్ అవుతుంది. అది సేవ్ చేసుకోవాలి.

Step 4: ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తును త‌ప్పులు లేకుండా నింపాలి.

Step 5: అనంత‌రం ఫీజు చెల్లించాలి.

Education News : వ‌చ్చే ఏడాది నాటికి నాలుగేళ్ల‌ ఏళ్ల‌ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు : యూజీసీ


ఫీజు వివ‌రాలు..

ఈ పరీక్ష సీబీఎసీఈ నిర్వహిస్తున్న 15వ పరీక్ష. సీటెట్ (CTET) దరఖాస్తు ఫీజు- పేపర్ 1 లేదా పేపర్ 2 పరీక్షకు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.500. రెండు పేపర్లు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.600.

అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్స్‌

- ప‌దోత‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్‌ (10th Certificate)

- ఇంట‌ర్ లేదా 12వ త‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్‌

- ఉన్న‌త విద్య సంబంధించిన ధ్రువ‌ప‌త్రాలు

- పాస్‌పోర్టు సైజ్‌ఫోటో (Passport Photo)

- సిగ్నేచ‌ర్ స్కాన్ కాపీ

ప్ర‌ధానమైన మార్పులు

- ఈ ఏడాది ప‌రీక్ష ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

- సీటెట్ వ్యాలిడిటీ గతంలో 7 ఏళ్లు ఉండేది. ప్ర‌స్తుతం ఆ వ్యాలిడిటీని జీవిత‌కాలానికి పెంచారు.

పరీక్ష హిందీ మరియు ఇంగ్లీషుతో సహా 20 భాషలలో నిర్వహించబడుతుంది. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించడం మాతృభాషలో బోధన కోసం వాదించే కొత్త జాతీయ విద్యా విధానం (NEP) కి అనుగుణంగా ఉంటుంది.

First published:

Tags: Application, EDUCATION, NOTIFICATION, Teaching

ఉత్తమ కథలు