CTET 2021: సీటెట్​ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు విధానం, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ పూర్తి వివరాలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి ఉన్న వారికి సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ (సీబీఎస్​ఈ) గుడ్​న్యూస్​ చెప్పింది. 2021 ఏడాదికి సంబంధించి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www.ctet.nic.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

  • Share this:
ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి ఉన్న వారికి సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ (సీబీఎస్​ఈ) గుడ్​న్యూస్​ చెప్పింది. 2021 ఏడాదికి సంబంధించి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www.ctet.nic.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆన్​లైన్​ దరఖాస్తుకు అక్టోబర్ 19 వరకు అవకాశం కల్పించింది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా డిసెంబర్​ 16 నుంచి 2022 జనవరి 13 వరకు నిర్వహించనున్నట్లు సీబీఎస్​ఈ పేర్కొంది. గతంలో ఆఫ్​లైన్​ విధానంలో సీటెట్​ పరీక్ష నిర్వహించగా.. ఈ ఏడాది నుంచి ఆన్​లైన్​ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షను మొత్తం 20 భాషల్లో నిర్వహించనున్నట్లు వివరించింది. సీటెట్​ సిలబస్​, పరీక్ష విధానానికి సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.

పరీక్ష విధానం

సీటెట్​–2021 లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఏ పేపర్​లో ఏ సబ్జెక్ట్​ల నుంచి ప్రశ్నలొస్తాయి? ఎన్ని మార్కులుంటాయి? వంటి వివరాలను పరిశీలించండి.

పేపర్​–1 సిలబస్​

దీన్ని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు బోధించే వారికి నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. దీనిలో 150 మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలొస్తాయి. ఇందులో చైల్డ్​ డెవలప్​మెంట్​ అండ్​ పెడగాజి నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, లాంగ్వేజ్​ 1 నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, లాంగ్వేజ్​ 2 నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, మ్యాథమేటిక్స్​ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, ఎన్విరాన్​మెంటల్​ స్టడీస్​ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. NCERT సిలబస్ అనుగుణంగా ప్రశ్నలుంటాయి.

పేపర్​–2 సిలబస్​

దీన్ని ఆరో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు భోధించే వారికి నిర్వహిస్తారు. ఇది మొత్తం 150 మార్కులకు ఉంటుంది. దీనిలో మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలొస్తాయి. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, మ్యాథమెటిక్స్ అండ్​ సైన్స్​​ నుంచి 60 ప్రశ్నలకు 60 మార్కులు లేదా సోషల్​ స్టడీస్​ నుంచి 60 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయించారు. రెండు పేపర్లలోనూ లాంగ్వేజ్​ సెలక్షన్​కు ఇంగ్లీష్, హిందీతో సహా 20 లాంగ్వేజ్​ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
Published by:Krishna Adithya
First published: