CTET 2021 IF YOU HAVE ANY PROBLEMS DOWNLOADING THE CTET ADMIT CARD THEN DO THIS EVK
CTET 2021: సీటెట్ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ కావడం లేదా.. అయితే ఇలా చేయండి!
ప్రతీకాత్మక చిత్రం
CTET 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2021 అడ్మిట్‌లను విడుదల చేసింది. డిసెంబర్ 16, 2021 నుంచి జనవరి 13, 2022 వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. ఎవరికైన అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ కాకపోతే ఏం చేయాలో సీబీఎస్ఈ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2021 అడ్మిట్‌ను డిసెంబర్ 11న అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inలో విడుదల చేసింది. డిసెంబర్ 16, 2021 నుంచి జనవరి 13, 2022 వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2021 ఫైనల్ అడ్మిట్ కార్డ్ ఈరోజు, డిసెంబర్ 14న జారీ అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి. ఈ అడ్మిట్ కార్డుల్లో అడ్మిట్ కార్డులు (Admit Cards) పరీక్ష రాసే నగరం, సమయాన్ని మాత్రమే కనబడతాయి. పరీక్షా కేంద్రం మరియు పరీక్ష యొక్క షిఫ్ట్ సమాచారంతో రెండవ దశ అడ్మిట్ కార్డ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు దశ అడ్మిట్ కార్డులు పరీక్షకు 02 రోజుల ముందు వెబ్‌సైట్‌లో కనబడతాయి. కావున అభ్యర్థులు ముందుగా తమ ఈ-అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలని సీబీఎస్‌సీ సూచస్తోంది.
డౌన్‌లోడ్ చేసుకొనే విధానం..
- ముందుగా అధికారిక వెబ్‌సైను సందర్శించాలి - ctet.nic.in
- అనంతరం Download admit Cards లింక్‌పై క్లిక్ చేయాలి.
- తరువాత https://testservices.nic.in/ExamSys21/DownloadAdmitCard/AuthCandCTET.aspx లింక్ ఓపెన్ అవుతుంది.
- అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ ఇచ్చి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ కాకుంటే ఏం చేయాలి..?
ఒకవేళ ఎవరైనా దరఖాస్తుదారులు ఈ-అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోలేకపోతే.. సీ టెట్ స్టోరీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందు కోసం 011-2240112, 22240108, 22240107, 22247154 నంబర్లకు (9.00 AM నుండి 5.30 PM) సంప్రదించవ్చు. ఇలాంటి అభ్యర్థులకు ఈ-అడ్మిట్ కార్డ్ఉలను పోస్ట్ ద్వారా పంపరు అనే విషయాన్ని గుర్తించుకోవాలని అధికారికంగా పేర్కొన్నారు.
మొదటి షిప్టు ఉదయం 9:30 గంటల నుంచి, రెండో షిప్టు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 15న ఫలితం వెలువడనుంది. CTET 2021 ఈసారి ఆన్‌లైన్ (Online)లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష సర్టిఫికేట్ వ్యాలిడిటీ జీవితకాలం చెల్లుతుంది. ఇంతకుముందు ఇది ఏడేళ్లపాటు మాత్రమే చెల్లుబాటయ్యేది. CTETలో ఉత్తీర్ణత సాధించిన వారు ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ ఉద్యోగానికి హామీ ఇవ్వదు. రెండు పేపర్లు ఉన్నాయి - పేపర్ 1 క్లియర్ చేసిన వారు 1 నుంచి 5 తరగతులకు బోధించడానికి అర్హులు, పేపర్ 2 క్లియర్ చేసిన వారు 6 నుండి 8 తరగతులకు బోధించవచ్చు.
పాస్ మార్కుల కట్ ఆఫ్..
- CTET 2021 ఉత్తీర్ణత మార్కులు సాధారణ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం మార్కులు రావాలి.
- షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST), ఇతర వెనుకబడిన తరగతుల (OBC) వర్గాలకు 55 శాతం మార్కులు రావాలి.
- అంటే అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు మొత్తం 150 మార్కులకు కనీసం 90 మార్కులను పొందవలసి ఉంటుంది.
పరీక్ష పత్రం వివరాలు..
- CTET 2021లో I మరియు II అనే రెండు పేపర్లు ఉంటాయి.
- ఒక్కో పేపర్‌కు 150 MCQలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి.
- పేపర్ Iలో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడాగోజీ, లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.
- పేపర్ IIలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడాగోజీ, లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.