ఉపాధ్యాయవృత్తిని చేపట్టాలనుకునేవారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-CTET నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సీటెట్ పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌లో ఇప్పటికే విడుదల అయ్యింది. దరఖాస్తులను సెప్టెంబర్ 20, 2021 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది సీటెట్ ను 16 డిసెంబర్ 2021 నుంచి13 జనవరి 2022 వరకు నిర్వహిస్తారు. పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష విధానంలో వచ్చిన మార్పులు.. దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుసుకొందాం.
ముఖ్యమైన తేదీలు..
అప్లికేషన్ ప్రారంభం | సెప్టెంబర్ 20, 2021 |
దరఖాస్తుకు ఆఖరు తేదీ | అక్టోబర్ 20, 2021 |
ఈ-చలాన్ చెల్లింపునకు చివరి తేదీ | అక్టోబర్ 20, 2021 |
ఆన్‌లైన్ కరెక్షన్లకు అవకాశం | అక్టోబర్ 22-28, 2021 |
అడ్మిట్ కార్డులు | డిసెంబర్ మొదటి వారం |
పరీక్ష తేదీలు | డిసెంబర్ 16, 2021 నుంచి జనవరి 13, 2022 |
ఫలితాలు | ఫిబ్రవరి 15, 2022 |
దరఖాస్తు చేసుకొనే విధానం..
Step 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://ctet.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P ను సందర్శించాలి.
Step 2: అక్కడ ‘Apply Online’ పై క్లిక్ చేయండి
Step 3: రిజిస్టర్ నంబర్ జనరేట్ అవుతుంది. అది సేవ్ చేసుకోవాలి.
Step 4: ఆన్‌లైన్ దరఖాస్తును తప్పులు లేకుండా నింపాలి.
Step 5: అనంతరం ఫీజు చెల్లించాలి.
CLW Recruitment 2021: సీఎల్‌డబ్ల్యూలో 492 అప్రెంటీస్ పోస్టులు
ఫీజు వివరాలు..
ఈ పరీక్ష సీబీఎసీఈ నిర్వహిస్తున్న 15వ పరీక్ష. సీటెట్ (CTET) దరఖాస్తు ఫీజు- పేపర్ 1 లేదా పేపర్ 2 పరీక్షకు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.500. రెండు పేపర్లు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.600.
అవసరమైన డాక్యుమెంట్స్
- పదోతరగతి సర్టిఫికెట్
- ఇంటర్ లేదా 12వ తరగతి సర్టిఫికెట్
- ఉన్నత విద్య సంబంధించిన ధ్రువపత్రాలు
- పాస్‌పోర్టు సైజ్‌ఫోటో
- సిగ్నేచర్ స్కాన్ కాపీ
ప్రధానమైన మార్పులు
- ఈ ఏడాది పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
- సీటెట్ వ్యాలిడిటీ గతంలో 7 ఏళ్లు ఉండేది. ప్రస్తుతం ఆ వ్యాలిడిటీని జీవితకాలానికి పెంచారు.
పరీక్ష హిందీ మరియు ఇంగ్లీషుతో సహా 20 భాషలలో నిర్వహించబడుతుంది. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించడం మాతృభాషలో బోధన కోసం వాదించే కొత్త జాతీయ విద్యా విధానం (NEP) కి అనుగుణంగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aim teacher, EDUCATION, Exams, NOTIFICATION