ఉపాధ్యాయవృత్తిని చేపట్టాలనుకునేవారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-CTET నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సీటెట్ పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు సీబీఎస్సీ (CBSC) నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ సారి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పరీక్ష డిసెంబర్ 16, 2021 నుంచి ప్రారంభమై జనవరి 13, 2022 వరకు నిర్వహిస్తారు. అయితే CTET 2021 కోసం దరఖాస్తు చేసుకొన్న వారు అడ్మిట్ కార్డ్‌ల కోసం వేచి ఉన్నారు. అడ్మిట్ కార్డులు జారీ చేయబడిన తర్వాత, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం. ఇప్పటికే అభ్యర్థుల కోసం సీటెట్-2021 (CTET-2021) నమూన పరీక్ష పత్రాన్న విడుదల చేసింది. ఈ పరీక్ష పత్రాలను సీటెట్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకొనే విధానం..
Step 1 : ముందుగా, అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ను సందర్శించాలి.
Step 2 : హోమ్ పేజీలో “TET డిసెంబర్ అడ్మిట్ కార్డ్ 2021” అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
Online Course: కంప్యూటర్ సైన్స్ టీచింగ్ స్కిల్స్‌పై ఆన్‌లైన్ కోర్స్.. ఫీజు, దరఖాస్తు విధానం
Step 3 : అనంతరం స్క్రీన్‌పై కొత్త పేజీని చూస్తారు.
Step 4 : డౌన్‌లోడ్ కోసం అడిగిన ఆధారాలను పూరించాలి.
Step 5 : అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
Step 6 : అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసి, దాని ప్రింటవుట్ తీసుకోండి.
పరీక్ష విధానం..
పేపర్ 1 విద్యార్హత- పేపర్ -1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (Diploma In Education) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
NEET counselling 2021: ఫేక్ ఏజెంట్లతో జాగ్రత్త.. నీట్ కౌన్సెలింగ్‌పై ఎంసీసీ మార్గదర్శకాలు
పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు రెండేళ్లు ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
సీటెట్ ఎందుకు..
ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల(Students)కు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్- 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aim teacher, Career and Courses, EDUCATION, Education CBSE, Exams