CTET 2020: సీటెట్ పరీక్ష తేదీ వచ్చేసిందా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

14వ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)( తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు CTET వెబ్సైట్‌ను ఫాలో కావాలని సూచించింది.

news18-telugu
Updated: October 23, 2020, 4:06 PM IST
CTET 2020: సీటెట్ పరీక్ష తేదీ వచ్చేసిందా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ప్రతీకాత్మ చిత్రం
  • Share this:
కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET) పరీక్షల తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారా? అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జులైలో జరగాల్సిన పరీక్షలు కరోనా వలన వాయిదా పడ్డాయి. ఐతే మన దేశంలో కరోనా కేసులు క్రమంగ తగ్గముఖం పట్టడంతో పాటు రికవరీలు పెరగడంతో.. నీట్, జేఈఈ వంటి పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విజయవంతంగా పరీక్షలను పూర్తి చేశారు. ఈ క్రమంలో సీటెట్ పరీక్షల నిర్వహణకు కూడా సీబీఎస్ఈ సన్నద్ధమవుతోంది. ఐతే సీటెల్ పరీక్ష నవంబరు 5 నిర్వహిస్తున్నట్లు సీబీఎస్‌ఈ పేరిట ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ప్రచారంపై PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని.. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని ప్రజలకు సూచించింది. ఏదైనా పరీక్ష లేదీని CBSE అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపింది. CTET వెబ్‌సైట్ ద్వారా పరీక్షల తేదీపై అప్‌డేట్ ఇస్తామని సీబీఎస్ఈ ఇది వరకే ప్రకటన ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.


అటు సీబీఎస్ఈ కూడా ఫేక్‌న్యూస్‌ని ఖండించింది. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షల తేదీలను ప్రకటిస్తామని జూన్ 25న ప్రకటన జారీ చేశామని తెలిపింది. 14వ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు CTET వెబ్సైట్‌ను ఫాలో కావాలని సూచించింది.


సీటెట్ పరీక్షలో క్వాలిఫై అయినవారికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పాఠశాలల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్-APS, నవోదయ విద్యాలయ సమితి-NVS, కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడొచ్చు. మరోవైపు సీటెట్, టెట్ సర్టిఫికెట్ల వాలిడిటీని కేంద్రం పొడించిన విషయం తెలిసిందే. ఏడేళ్ల వరకే ఉన్న వ్యాలిడిటీని జీవిత కాలం పాటు పొడిగించింది. ఈ నిర్ణయంతో టెట్ అభ్యర్థులకు పెద్ద ఊరట లభించినట్లయింది. అభ్యర్థులు మళ్లీ మళ్లీ పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు.
Published by: Shiva Kumar Addula
First published: October 23, 2020, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading