CTET 2020: టీచర్ కావాలనుకుంటున్నారా? ఈ పరీక్ష రాయండి

CTET July 2020 | సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

news18-telugu
Updated: February 3, 2020, 12:27 PM IST
CTET 2020: టీచర్ కావాలనుకుంటున్నారా? ఈ పరీక్ష రాయండి
CTET 2020: టీచర్ కావాలనుకుంటున్నారా? ఈ పరీక్ష రాయండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
టీచర్ కావడం మీ కలా? ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకుంటున్నారా? మంచి విద్యాసంస్థలో టీచర్‌గా స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్-CTET జూలై 2020 దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 'సీటెట్ జూలై 2020' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. 2020 జూలై 5న సీటెట్ నిర్వహించనుంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 24 చివరి తేదీ. అధికారిక వెబ్‌సైట్ https://ctet.nic.in/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

CTET July 2020: నోటిఫికేషన్ వివరాలివే...


దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 24

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 24
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 27
సీటెట్ దరఖాస్తు ఫామ్‌లో తప్పులు సవరణలు- 2020 మార్చి 17 నుంచి 24


సీటెట్ అడ్మిట్ కార్డ్- 2020 జూన్సీటెట్ పరీక్ష తేదీ- 2020 జూలై 5
ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ 2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ 1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- పేపర్ 1 లేదా పేపర్ 2 పరీక్షకు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.500. రెండు పేపర్లు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.600.
పేపర్ 1 విద్యార్హత- పేపర్ 1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
సీటెట్ 2020 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

Indian Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 138 జాబ్స్... ఖాళీల వివరాలివే

Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు