Shipyard Jobs: షిప్‌యార్డ్‌లో 577 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Cochin Shipyard Recruitment 2020 | ఐటీఐ పాసైనవారికి గుడ్ న్యూస్. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-CSL 577 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: September 29, 2020, 12:59 PM IST
Shipyard Jobs: షిప్‌యార్డ్‌లో 577 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
Shipyard Jobs: షిప్‌యార్డ్‌లో 577 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-CSL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 577 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 577 పోస్టుల్లో జనరల్ అభ్యర్థులకు 268, ఓబీసీ అభ్యర్థులకు 189, ఎస్సీ అభ్యర్థులకు 68, ఎస్టీ అభ్యర్థులకు 5, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 47 పోస్టులున్నాయి. వేర్వేరు విభాగాల్లో వర్క్‌మెన్ పోస్టులు ఇవి. షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఫిట్టర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులున్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసినవారు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 10 చివరి తేదీ. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://cochinshipyard.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.

Cochin Shipyard Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 577
షీట్ మెటల్ వర్కర్- 88
వెల్డర్- 71
ఫిట్టర్- 31
మెకానిక్ డీజిల్- 30మెకానిక్ మోటార్ వెహికిల్- 6
ఫిట్టర్ పైప్ (ప్లంబర్)- 21
పెయింటర్- 13
ఎలక్ట్రీషియన్- 63
క్రేన్ ఆపరేటర్ (EOT)- 19
ఎలక్ట్రానిక్ మెకానిక్- 65
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 65
షిప్ రైట్ వుడ్- 15
మెషినిస్ట్- 11
ఆటో ఎలక్ట్రీషియన్- 2
స్కాఫోల్డర్- 19
ఏరియల్ వర్క్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్- 2
సెమీ స్కిల్డ్ రిగ్గర్- 53
సెరంగ్- 2
కుక్- 1

DRDO Recruitment 2020: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో 90 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

UPSC Recruitment 2020: మొత్తం 307 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Cochin Shipyard Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 10
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 30 ఏళ్ల లోపు
దరఖాస్తు ఫీజు- షీట్ మెటల్ వర్కర్ నుంచి ఆటో ఎలక్ట్రీషియన్ వరకు రూ.300. ఇతర పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

ECIL Jobs 2020: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

BOI Recruitment 2020: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Cochin Shipyard Recruitment 2020: అప్లై చేయండి ఇలా


అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.
ఆ తర్వాత https://cochinshipyard.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
కెరీర్ సెక్షన్‌లో Apply Online పైన క్లిక్ చేయాలి.
పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
Published by: Santhosh Kumar S
First published: September 29, 2020, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading