CSIR: ప్రభుత్వ సంస్థల్లో టెక్నికల్ విభాగాల్లో కొలువు సంపాదించాలని నిరీక్షిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ప్రముఖ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) సంస్థ జాబ్ నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. టెక్నికల్ అసిస్టెంట్లు పోస్టులు(Technical Assistant Posts) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న, ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఈ వివరాలు..
CSIR నోటిఫికేషన్
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) గ్రేడ్ III టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 19న ప్రారంభమైంది. నోటిఫికేషన్ ప్రకారం.. డిపార్ట్‌మెంట్ మొత్తం 34 పోస్టులను భర్తీ చేయాలని చూస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు CSIR అధికారిక వెబ్‌సైట్ csir.res.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 17 లోపు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది.
విద్యార్హత, వయోపరిమితి
దరఖాస్తుదారులు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల ఫుల్ టైమ్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. లేదా సంబంధిత ఫీల్డ్/ఏరియాలో రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థికి వయోపరిమితి 28 సంవత్సరాలు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ ఫీజు
అధికారిక నోటీసు ప్రకారం స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసిన అభ్యర్థులను ట్రేడ్ టెస్ట్ తర్వాత రాత పరీక్షకు పిలుస్తారు. రాత పరీక్షలో అభ్యర్థి పనితీరు ఆధారంగా తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు. పేపర్-I, పేపర్ II పేపర్ IIIగా మూడు పేపర్లు ఉంటాయి. పేపర్-Iలో కనీస కట్-ఆఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులకు సంబంధించిన పేపర్ II& IIIలను మూల్యాంకనం చేస్తారు. పేపర్ II, పేపర్ IIIలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే తుది మెరిట్ జాబితా సిద్ధం చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. SC, ST, PwBD, మహిళలు, CSIR ఉద్యోగులకు, మాజీ సైనిక అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు.
AAI Recruitment: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్..AAI జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్ ఇలా..
జీతం
ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు పే స్కేల్ రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
ఆసక్తి గల అభ్యర్థులు మొదట సంస్థ అధికారిక వెబ్‌సైట్ recruitment.csir.res.in ఓపెన్ చేయాలి.అందులో అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత, అభ్యర్థులు Email IDని ఎంటర్ చేయాలి. అనంతరం దరఖాస్తు ఫారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని వివరాలను నమోదు చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసేముందు, ఫీజు చెల్లించే ముందు అన్ని వివరాలను క్రాస్-చెక్ చేయాలి. చివరిగా పేమెంట్ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ స్క్రీన్‌షాట్ తీసుకొని దాన్ని ప్రింట్ చేసుకోవడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Job notification, JOBS