తమిళనాడు తిరువనంతపురంలోని సీఎస్ఐఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (National Institute For Interdisciplinary Science And Technology)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహిస్తారు. దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎటువంటి పరీక్ష లేకుండా షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తకు నవంబర్ 15, 2021 వరకు అవకాశం ఉంది. నోటిఫికేషన్, దరఖాస్తు విధానం కోసం అధికారికి వెబ్సైట్ https://www.niist.res.in/english/ ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు | జీతం |
ప్రాజెక్టు అసోసియేట్ | సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ అవసరమైన అనుభవం ఉండాలి. అభ్యర్థి వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు. | 06 | యూజీసీ నెట్+గేట్ అభ్యర్థులకు నెలకు రూ. 31, 000+హెచ్ఆర్ఐ జీతం, నాన్ గేట్ అభ్యర్థులకు నెలకు రూ.25,000+హెచ్ఆర్ఐ అందిస్తారు. |
TCS Recruitment 2021 : ఎంబీఏ చేసిన వారికి బెస్ట్ కెరీర్ ఆప్షన్.. టీసీఎస్‌లో ఉద్యోగాలు
ఎంపిక విధానం..
Step 1 : ముందుగా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థిని షార్ట్ లిస్ట్ చేస్తారు.
Step 2 : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థిని ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Step 3 : తుది మెరిట్ ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారి వెబ్సైట్ https://www.niist.res.in/english/ ను సందర్శించాలి.
Step 3 : అనంతరం నోటిఫికేషన్‌లోని అప్లికేషన్ లింక్‌లోకి వెళ్లాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 3 : అనంతరం అప్లికేషన్ కోసం http://parecruit.niist.res.in:8080/ లింక్‌పై క్లిక్ చేయండి.
Step 4 : దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదు చేయాలి.
Step 5 : అభ్యర్థి విద్యార్హత, వయసు సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Step 6 : దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 15, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION