Home /News /jobs /

CSIR NGRI JOBS HYDERABAD STARTED APPLICATIONS FOR SCIENTIST JOBS KNOW PROCESS EVK

CSIR Jobs: హైద‌రాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు.. జీతం రూ.ల‌క్ష‌.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం

ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు

ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు

CSIR-NGRI Recruitment: హైద‌రాబాద్‌ (Hyderabad) లోని సీఎస్ఐఆర్- జాతీయ‌ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (National Geophysical Research Institute ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు ఇంకా మూడు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. అంటే డిసెంబ‌ర్ 7, 2021 వ‌ర‌కు మాత్ర‌మే అప్లై చేసుకోవ‌చ్చు.

ఇంకా చదవండి ...
    హైద‌రాబాద్‌ (Hyderabad) లోని సీఎస్ఐఆర్- జాతీయ‌ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (National Geophysical Research Institute ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌లు విభాగాల్లో 18 సైంటిస్టు (Scientist) పోస్టుల‌కు అర్హుల‌ను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూ (Interview) ద్వారా మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ డిసెంబ‌ర్ 7, 2021న ప్రారంభం కానుంది. ఎంపికైన అభ్య‌ర్థికి రూ.1,16, 398 వేతనం అందించనున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. నోటిఫికేష‌న్ (Notification) వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్‌ https://www.ngri.res.in/openings-at-ngri.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    ముఖ్య‌మైన స‌మాచారం..















    పోస్టు పేరుఅర్హ‌త‌లుఖాళీలువేత‌నం
    సైంటిస్టుసంబంధిత సైన్స్‌ రంగాల్లో పీహెచ్‌డీ చేసి ఉండాలి. కొన్ని పోస్టుల‌కు అనుభ‌వం అవ‌స‌రం. వ‌య‌సు 32 సంవ‌త్స‌రాల నుంచి 37 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. ప‌రీక్ష లేనందున‌, అనుభ‌వం, మెరుగైన అక‌డ‌మిక్ రికార్డు ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు.18రూ.1,16,398

    Big iPhone 12 Pro: అమెజాన్​లో ఐఫోన్ 12 ప్రోపై భారీ డిస్కౌంట్​.. ఏకంగా రూ. 25 వేల తగ్గింపు


    Job Opportunities: ఈ ఉద్యోగాల‌కు అప్లై చేశారా..? అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌


     ఎంపిక విధానం..


    Step 1 : అభ్య‌ర్థులు ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 2 : అందులో అక‌డ‌మిక్ మెరిట్‌, అవ‌స‌ర‌మైన పోస్టుల‌కు అనుభ‌వం ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

    Step 3 : షార్ట్ లిస్ట‌యిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.

    Step 4 : ఇంట‌ర్వ్యూలో మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

    ద‌రఖాస్తు విధానం...

    Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    HAL Recruitment 2021: హెచ్ఏఎల్‌లో పారామెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. జీతం రూ.21,473


    RRB Group-D: ఆర్ఆర్‌బీ-గ్రూప్‌డీ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. అప్లికేష‌న్‌కు మ‌రో అవ‌కాశం


    Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.ngri.res.in/openings-at-ngri.php ను సంద‌ర్శించాలి.

    Step 3 : అనంతరం నోటిఫికేష‌న్ పూర్తిగా చద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4 : డిసెంబ‌ర్ 7, 2021 త‌రువాత పేజీలో Click here for online Application అనే లింక్ క‌న‌ప‌డుతుంది.

    Step 5 : అక్క‌డ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు పూర్తి చేయాలి.

    Step 6 : ద‌ర‌ఖాస్తు స‌బ్ చేసేందుకు రూ.100 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి.

    Step 7 : ద‌ర‌ఖాస్తుకు పూర్త‌యిన త‌రువాత అప్లికేష‌న్ ఫాంను ప్రింట్ తీసుకోవాలి.

    Step 8 : ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 7, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2021, Job notification, JOBS

    తదుపరి వార్తలు