Home /News /jobs /

CSIR NGRI HYDERABAD INVITES APPLICATIONS FOR SCIENTIST JOBS KNOW DETAILS EVK

CSIR-NGRI Recruitment: హైద‌రాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు.. జీతం రూ.1,16, 398.. ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకోండి

ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు

ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు

CSIR-NGRI Recruitment: హైద‌రాబాద్‌ (Hyderabad) లోని సీఎస్ఐఆర్- జాతీయ‌ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (National Geophysical Research Institute ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. డిసెంబ‌ర్ 7, 2021 నుంచి ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఇంకా చదవండి ...
    హైద‌రాబాద్‌ (Hyderabad) లోని సీఎస్ఐఆర్- జాతీయ‌ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (National Geophysical Research Institute ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌లు విభాగాల్లో 18 సైంటిస్టు (Scientist) పోస్టుల‌కు అర్హుల‌ను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూ (Interview) ద్వారా మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ డిసెంబ‌ర్ 7, 2021న ప్రారంభం కానుంది. ఎంపికైన అభ్య‌ర్థికి రూ.1,16, 398 వేతనం అందించనున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. నోటిఫికేష‌న్ (Notification) వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్‌ https://www.ngri.res.in/openings-at-ngri.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    ముఖ్య‌మైన స‌మాచారం..















    పోస్టు పేరుఅర్హ‌త‌లుఖాళీలువేత‌నం
    సైంటిస్టుసంబంధిత సైన్స్‌ రంగాల్లో పీహెచ్‌డీ చేసి ఉండాలి. కొన్ని పోస్టుల‌కు అనుభ‌వం అవ‌స‌రం. వ‌య‌సు 32 సంవ‌త్స‌రాల నుంచి 37 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. ప‌రీక్ష లేనందున‌, అనుభ‌వం, మెరుగైన అక‌డ‌మిక్ రికార్డు ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు.18రూ.1,16,398

    Wipro Recruitment: గ్రాడ్యుయేట్‌ల‌కు గుడ్ న్యూస్‌.. విప్రోలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు విధానం


    IIT JEE: మ‌రొక్క అవ‌కాశం ఇవ్వండి.. ఐఐటీ విద్యార్థుల విన్న‌పం


    ఎంపిక విధానం..

    Step 1 : అభ్య‌ర్థులు ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 2 : అందులో అక‌డ‌మిక్ మెరిట్‌, అవ‌స‌ర‌మైన పోస్టుల‌కు అనుభ‌వం ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

    Step 3 : షార్ట్ లిస్ట‌యిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.

    Step 4 : ఇంట‌ర్వ్యూలో మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

    ద‌రఖాస్తు విధానం...

    Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Smart Phone: ఫోన్‌లో ఆన్‌లైన్ యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఇలా చేయండి


    Online Course: కంప్యూట‌ర్ సైన్స్ టీచింగ్ స్కిల్స్‌పై ఆన్‌లైన్ కోర్స్‌.. ఫీజు, ద‌ర‌ఖాస్తు విధానం


    Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.ngri.res.in/openings-at-ngri.php ను సంద‌ర్శించాలి.

    Step 3 : అనంతరం నోటిఫికేష‌న్ పూర్తిగా చద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4 : డిసెంబ‌ర్ 7, 2021 త‌రువాత పేజీలో Click here for online Application అనే లింక్ క‌న‌ప‌డుతుంది.

    Step 5 : అక్క‌డ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు పూర్తి చేయాలి.

    Step 6 : ద‌ర‌ఖాస్తు స‌బ్ చేసేందుకు రూ.100 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి.

    Step 7 : ద‌ర‌ఖాస్తుకు పూర్త‌యిన త‌రువాత అప్లికేష‌న్ ఫాంను ప్రింట్ తీసుకోవాలి.

    Step 8 : ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 7, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు