Home /News /jobs /

CSIR NEERI RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS TOMORROW FOR 18 PROJECT ASSISTANT AND PROJECT ASSOCIATE POSTS KNOW HOW TO APPLY SS

CSIR NEERI Recruitment 2021: హైదరాబాద్‌లోని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్

CSIR NEERI Recruitment 2021: హైదరాబాద్‌లోని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్

CSIR NEERI Recruitment 2021: హైదరాబాద్‌లోని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్

CSIR NEERI Recruitment 2021 | హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    సీఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NEERI) ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికషన్స్ (Job Notifications) రిలీజ్ చేసింది. హైదరాబాద్, నాగ్‌పూర్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ లాంటి పోస్టులున్నాయి. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది ఈ సంస్థ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి చివరి తేదీ వేర్వేరుగా ఉంది. హైదరాబాద్‌లోని పోస్టులకు 2021 నవంబర్ 14 లోగా, నాగ్‌పూర్‌లోని పోస్టులకు 2021 నవంబర్ 4 లోగా దరఖాస్తు చేయాలి. విద్యార్హతలు, ఇతర వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    CSIR NEERI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





















    మొత్తం ఖాళీలు 18
    ప్రాజెక్ట్ అసిస్టెంట్ 10 (హైదరాబాద్)
    ప్రాజెక్ట్ అసోసియేట్ 3 (హైదరాబాద్)
    ప్రాజెక్ట్ అసోసియేట్ 5 (నాగ్‌పూర్)

    APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

    CSIR NEERI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    హైదరాబాద్‌లోని పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ- 2021 నవంబర్ 14

    నాగ్‌పూర్‌లోని పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ- 2021 నవంబర్ 4

    విద్యార్హతలు- ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు బాటనీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎన్విరాన్‌మెంట్ సైన్స్, జియాలజీ, అగ్రి (సాయిల్ సైన్స్‌) లో బీఎస్‌సీ పాస్ కావాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు ఎన్విరాన్‌మెంటల్, సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీ పాస్ కావాలి. లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ లేదా ఎంఈ పాస్ కావాలి.

    వేతనం- హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు రూ.20,000 + హెచ్ఆర్ఏ, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు రూ.25,000 + హెచ్ఆర్ఏ లభిస్తుంది. నాగ్‌పూర్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు రూ.35,000 వరకు వేతనం + హెచ్ఆర్ఏ లభిస్తుంది.

    ఎంపిక విధానం- ఆన్‌లైన్ ఇంటర్వ్యూ

    హైదరాబాద్‌లోని పోస్టులకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    నాగ్‌పూర్‌లోని పోస్టులకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Anganwadi Jobs: మహబూబ్‌నగర్ జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    CSIR NEERI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    Step 1- అభ్యర్థులు ముందుగా https://www.neeri.res.in/ వెబ్‌సైట్‌లో Recruitment సెక్షన్ ఓపెన్ చేయాలి.

    Step 2- Non Regular/Engagement of project assistants (Online) లింక్ పక్కన Apply Online పైన క్లిక్ చేయాలి.

    Step 3- నోటిఫికేషన్ నెంబర్, పోస్టు పేరు సెలెక్ట్ చేయాలి.

    Step 4- పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, మొబైల్ నెంబర్, స్కైప్ ఐడీ ఎంటర్ చేయాలి.

    Step 5- ఆ తర్వాత విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 6- అనుభవం ఉంటే ఆ వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 7- ఆ తర్వాత దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

    Step 8- దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి.

    Step 9- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి hzcparecruit@gmail.com మెయిల్ ఐడీకి పంపాలి.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు