CSIR-NBRI recruitment: ఎన్​బీఆర్​ఐలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

(ప్రతీకాత్మక చిత్రం)

ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా 10 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్​ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు సీఎస్​ఐఆర్​–ఎన్​బీఆర్​ఐ అధికారిక వెబ్‌సైట్ www.nbri.res.inద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • Share this:
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్​న్యూస్​. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​ (సీఎస్​ఐఆర్)కి చెందిన లక్నోలోని- నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్​బీఆర్​ఐ) సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా 10 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్​ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు సీఎస్​ఐఆర్​–ఎన్​బీఆర్​ఐ అధికారిక వెబ్‌సైట్ www.nbri.res.inద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి దరఖాస్తు ఫారమ్‌ను పోస్ట్ ద్వారా కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఎన్​బీఆర్​ఐ, రాణా ప్రతాప్ మార్గ్, లక్నో–226001 అడ్రస్​కు పంపించాలి. అప్లికేషన్​ ఫారమ్​తో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సెప్టెంబర్ 30లోపు పైన పేర్కొన్న చిరునామాకు చేరుకోవాలి. సెప్టెంబర్​ 30లోపు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ఖాళీల వివరాలు

ఈ నోటిఫికేషన్​ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) పోస్టులో 5 ఖాళీలు ఉండగా.. ఫైనాన్స్ & అకౌంట్స్, స్టోర్స్​ అండ్​ పర్చేజ్​ డిపార్ట్​మెంట్​లో 5 ఖాళీలున్నాయి.

వయోపరిమితి

పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు సెప్టెంబర్ 30 నాటికి 28 ఏళ్లకు మించకూడదు.

అప్లికేషన్​ ఫీజు

అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్​ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. "డైరెక్టర్, సీఎస్​ఐఆర్​- నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, లక్నో" పేరుతో రూ. 100 డిమాండ్ డ్రాఫ్ట్ తీసి దాన్ని అప్లికేషన్ ఫారమ్​​తో పాటు పంపించాలి.

సెలక్షన్​ ప్రాసెస్​

మొత్తం రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ముందుగా అభ్యర్థులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. దీనిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో వచ్చిన మార్కులను బట్టి ఫైనల్​ సెలక్షన్​ ఉంటుంది. నోటిఫికేషన్​కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఎన్​బీఆర్​ఐ అధికారిక వెబ్​సైట్​ www.nbri.res.in ను సందర్శించండి.
Published by:Krishna Adithya
First published: