హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CSIR Jobs: సీఎస్ఐఆర్‌లో వేర్వేరు విభాగాల్లో 79 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

CSIR Jobs: సీఎస్ఐఆర్‌లో వేర్వేరు విభాగాల్లో 79 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

సీఎస్ఐఆర్‌-ఎన్ఐఐఎస్‌టీ రిక్రూట్‌మెంట్‌

సీఎస్ఐఆర్‌-ఎన్ఐఐఎస్‌టీ రిక్రూట్‌మెంట్‌

CSIR Jobs: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ (Council Of Scientific And Industrial Research)లో వేర్వేరు విభాగాల్లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌లు వెలువ‌డ్డాయి. అన్ని విభాగాల్లో క‌లిపి 79 పోస్టులు ఉన్నాయి. వాటి వివ‌రాలు.. అర్హ‌త‌లు తెలుసుకోండి

ఇంకా చదవండి ...

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ (Council Of Scientific And Industrial Research)లో వేర్వేరు విభాగాల్లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌లు వెలువ‌డ్డాయి. త‌మిళ‌నాడు (Tamil Nadu) కరైకుడిలోని సెంట‌ర్ ఎల‌క్ట్రో కెమిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (Central Electro Chemical Research Institute) లో 54 పోస్టులు  హైద‌రాబాద్‌ (Hyderabad) లోని సీఎస్ఐఆర్- జాతీయ‌ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (National Geophysical Research Institute ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌లు విభాగాల్లో 18 సైంటిస్టు (Scientist) పోస్టుల‌కు అర్హుల‌ను ఎంపిక చేస్తారు. త‌మిళ‌నాడు (Tamil Nadu) తిరువ‌నంత‌పురంలోని సీఎస్ఐఆర్ - నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఇంట‌ర్ డిసిప్లిన‌రీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (National Institute For Interdisciplinary Science And Technology)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

CSIR-CECRI Recruitment..


ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా టెక్నిక‌ల్ అసిస్టెంట్‌లు, టెక్నిషియ‌న్ పోస్టుల క‌లిపి 54 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల ఆధారంగా వేత‌నం రూ.28,216 నుంచి రూ.50,448 వ‌ర‌కు ఉంటుంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఫెలోషిప్ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ.. జీతం రూ.31,000


ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు చేసుకొవాలి. ఇందుకు సంబంధించిన పూర్తి స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://cecri.res.in/Opportunities.aspx ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

CSIR-NGRI Recruitment..


హైద‌రాబాద్‌ (Hyderabad) లోని సీఎస్ఐఆర్- జాతీయ‌ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (National Geophysical Research Institute ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌లు విభాగాల్లో 18 సైంటిస్టు (Scientist) పోస్టుల‌కు అర్హుల‌ను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూ (Interview) ద్వారా మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ డిసెంబ‌ర్ 7, 2021న ప్రారంభం కానుంది. ఎంపికైన అభ్య‌ర్థికి రూ.1,16, 398 వేతనం అందించనున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. నోటిఫికేష‌న్ (Notification) వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్‌ https://www.ngri.res.in/openings-at-ngri.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

CSIR-NIIST Recruitment 2021..


త‌మిళ‌నాడు (Tamil Nadu) తిరువ‌నంత‌పురంలోని సీఎస్ఐఆర్ - నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఇంట‌ర్ డిసిప్లిన‌రీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (National Institute For Interdisciplinary Science And Technology)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌ను కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తారు. ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా షార్ట్ లిస్టింగ్‌, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ (Interview) ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్త‌కు న‌వంబ‌ర్ 22, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారికి వెబ్‌సైట్ https://www.niist.res.in/english/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

First published:

Tags: Govt Jobs 2021, Job notification, JOBS

ఉత్తమ కథలు