హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CSIR-CECRI Recruitment : సీఎస్ఐఆర్‌లో టెక్నిక‌ల్ పోస్టులు.. జీతం రూ.50,448.. ద‌ర‌ఖాస్తు విధానం ఇదే

CSIR-CECRI Recruitment : సీఎస్ఐఆర్‌లో టెక్నిక‌ల్ పోస్టులు.. జీతం రూ.50,448.. ద‌ర‌ఖాస్తు విధానం ఇదే

సీఎస్ఐఆర్‌-సీఈసీఆర్ఐలో ఉద్యోగాలు

సీఎస్ఐఆర్‌-సీఈసీఆర్ఐలో ఉద్యోగాలు

CSIR-CECRI Recruitment :త‌మిళ‌నాడు (Tamil Nadu) కరైకుడిలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ - సెంట‌ర్ ఎల‌క్ట్రో కెమిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

త‌మిళ‌నాడు (Tamil Nadu) కరైకుడిలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ - సెంట‌ర్ ఎల‌క్ట్రో కెమిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (Council Of Scientific And Industrial Research–Central Electro Chemical Research Institute) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా టెక్నిక‌ల్ అసిస్టెంట్‌లు, టెక్నిషియ‌న్ పోస్టుల క‌లిపి 54 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల ఆధారంగా వేత‌నం రూ.28,216 నుంచి రూ.50,448 వ‌ర‌కు ఉంటుంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు చేసుకొవాలి. ఇందుకు సంబంధించిన పూర్తి స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://cecri.res.in/Opportunities.aspx ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

పోస్టుల వివ‌రాలు.. అర్హ‌త‌లు

పోస్టు పేరుఅర్హ‌త‌లుజీతంఖాళీలు
టెక్నిక‌ల్ అసిస్టెంట్సంబంధిత స‌బ్జెక్టుల్లో 60శాతం మార్కుల‌తో డిప్ల‌మా, బీఎస్సీలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం ఉండాలి.రూ.50,44841
టెక్నిషియ‌న్‌ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.రూ.28,21613


ISRO Courses : ఇస్రోలో రిమోట్‌సెన్సింగ్‌పై రెండు నెల‌ల కోర్స్‌.. ద‌ర‌ఖాస్తు విధానం


ఎంపిక విధానం..

- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

- షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు స్కిల్‌/ ట్రేడ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు.

- టెక్నిక‌ల్ అసిస్టెంట్ అభ్య‌ర్థుల‌కు మొత్తం 200 ప్ర‌శ్న‌ల‌తో మూడు పేప‌ర్ల‌తో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

- టెక్నిషియ‌న్‌కు మొత్తం 150 ప్ర‌శ్న‌ల‌తో మూడు పేప‌ర్ల‌తో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

- ప‌రీక్ష ద్వారా ఎంపికైన వారిని తుది పోస్టుల‌కు ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cecri.res.in/Opportunities.aspx ను సంద‌ర్శించాలి.

Step 3 :  అనంత‌రం నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4 : ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొంటున్నారో ఆ పోస్టు పేరు ముందు Apply online లింక్‌ను క్లిక్ చేయాలి.

Step 5 : టెక్నిక‌ల్ అసిస్టెంట్ అప్లికేష‌న్ కోసం https://gr3recruit.cecri.res.in/recruit_mainmenu.asp లింక్‌ను క్లిక్ చేయాలి.

Step 6 : టెక్నిషియ‌న్ అప్లికేష‌న్ కోసం https://gr2recruit.cecri.res.in/recruit_mainmenu.asp లింక్‌ను క్లిక్ చేయాలి.

Step 7 : ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు పూర్తి చేయాలి.

Step 8 : ద‌ర‌ఖాస్తు పూర్తి చేసిన త‌రువాత అప్లికేష‌న్ ప్రింట్ తీసి అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లను పొందు ప‌రిచి

The Controller of Administration,

CSIR–Central Electrochemical Research Institute,

Karaikudi–630003, Tamil Nadu అడ్ర‌స్‌కు పంపాలి.

Step 9 : ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: Govt Jobs 2021, Job notification, JOBS

ఉత్తమ కథలు