Home /News /jobs /

CSC LAUNCHES YOGYATA APP TO IMPART SKILL BASED VOCATIONAL EDUCATION TO RURAL YOUTH GH VB

Yogyata App: రూరల్ యూత్‌కు అద్భుతమైన ఛాన్స్.. యోగ్యత యాప్​ ద్వారా జాబ్​ ఆఫర్.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు స్కిల్ బేస్డ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ అందిస్తున్న కామన్ సర్వీస్ సెంటర్​(CSC).. మరో అడుగు ముందడుగు వేసింది. తాజాగా ఈ సంస్థ యోగ్యత యాప్‌ను (Yogyata app) ప్రారంభించింది. దీనిద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తోంది.

ఇంకా చదవండి ...
గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు స్కిల్ బేస్డ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్‌(Ocational Education) అందిస్తున్న కామన్ సర్వీస్ సెంటర్​(CSC).. మరో అడుగు ముందడుగు వేసింది. తాజాగా ఈ సంస్థ యోగ్యత యాప్‌ను (Yogyata app) ప్రారంభించింది. దీనిద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. గ్రామీణ యువతకు ఉపాధి మార్గాలను సులభతరం చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు, విద్యార్హతలను అందించే కోర్సులను ఇందులో నేర్పిస్తారు. దీనిలో భాగంగా సైబర్ సెక్యూరిటీ, క్యాడ్(CAD), 3డీ ప్రింటింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తున్నట్లు సీఎస్​సీ(CSC) ప్రకటించింది.

RRB NTPC CBT-2: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ సీబీటీ–2 పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్​​, సిలబస్, కటాఫ్​ మార్కులు ఇవే..


"కరోనా మహమ్మారి కారణంగా ఈ-లెర్నింగ్‌ తప్పనిసరిగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, యువతకు నాణ్యమైన వృత్తి విద్యను అందించిందుకు యోగ్యత యాప్ ఉపయోగపడుతుంది" అని సీఎస్​ఈ ఈ-గవర్నెన్స్(CSC) సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ త్యాగి అన్నారు.
"యోగ్యత యాప్ గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలను అందించడంలో సహాయపడుతుంది. తద్వారా వారు ఉద్యోగాలు పొందేందుకు అర్హులను చేస్తుంది" అని త్యాగి అభిప్రాయపడ్డారు.

UOH Recruitment 2022: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఖాళీలు... పరీక్ష లేకుండా ఉద్యోగం

గేమ్ ఛేంజర్​ యాప్..
దీనిలో కంటిన్యూస్ లెర్నింగ్ మోడ్‌లో శిక్షణ ఇస్తారు. దేశంలోని సీఎస్​ఈలను నిర్వహించే గ్రామ స్థాయి కేంద్రాలు, యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. "కొవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల అభివృద్ధికి మందగించింది. అయితే గ్రామీణ యువతలో దాగి ఉన్న అసమాన ప్రతిభను వెలికి తీసేందుకు ఆన్​లైన్ వేదికగా అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే దాదాపు 40శాతం మంది గ్రామీణ యువత సాధారణ పనిలో నిమగ్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ వేదికల ద్వారా వీరిలోని నైపుణ్యాలను మెరుగుదిద్దగలిగితే అద్భుతాలు చూడవచ్చు" అని త్యాగి చెప్పారు.

NER Railway Recruitment 2022: టెన్త్ అర్హతతో రైల్వేలో 323 జాబ్స్.. రూ.25 వేల వేతనం.. ఇలా అప్లై చేసుకోండి

మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉద్యోగాల భర్తీకి తాజాగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. లీగల్ ఆఫీసర్, మేనేజర్, క్యూరేటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 14 ఖాళీలున్నాయి. ఆర్‌బీఐ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు కోల్‌కతాలోని ఆర్‌బీఐ మ్యూజియంలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 4 చివరి తేదీ. ఇవి ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ పోస్టులు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తుల్ని స్వీకరించరు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Private Jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు