సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ప్రొటక్షన్ ఫోర్స్ (CRPF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో సారి భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (CRPF Job Notification) విడుదల చేసింది. మొత్తం 1458 ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 4న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు crpf.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
S.No. | పోస్టు | ఖాళీలు |
1. | అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనో) | 143 |
2. | హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) | 1315 |
మొత్తం: | 1458 |
విద్యార్హతల వివరాలు: అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ లేదా అందుకు సమానమైన పరీక్షను గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి పాసై ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు. అభ్యర్థుల వయస్సు జనవరి 25 నాటికి 18 నుంచి 25 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు.
BEL Recruitment 2022: బీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్.. రూ.40 వేల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ .. ఇలా అప్లై చేసుకోండి
ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా మరో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.