సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పంది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మెడికల్ ఆఫీసర్ (MO), జనరల్ డ్యూటీస్ మెడికల్ ఆఫీసర్(GDMO) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులను ఇంటర్వ్యూల (Interviews) ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
పోస్టు | ఖాళీలు | విద్యార్హత | వేతనం |
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ | 29 | సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. పీజీ తర్వాత ఏడాదిన్నర అనుభవం ఉండాలి. పీజీ డిప్లొమా చేసిన వారికి రెండున్నరేళ్ల అనుభవం ఉండాలి. | రూ. 85,000 |
GDMO | 31 | ఎంబీబీఎస్, ఇంటర్న్ షిప్ | రూ.75,000 |
ఇతర పూర్తి వివరాలు:
-ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో (Job Notifications) స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ (Job Contract) గడువు మూడేళ్లు ఉంటుంది. మరో రెండేళ్లను కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంటుంది.
-అభ్యర్థులు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో (Job Notification)స్పష్టం చేశారు.
-వేతనం మినహా ఇతర టీఏ, డీఏ వంటి సదుపాయాలు ఉండవని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-అభ్యర్థుల వయస్సు 70 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు కావాల్సిన అన్ని ధ్రువపత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
-విద్యార్హత, వయస్సు, అనుభవం ధ్రువపత్రాలను తీసుకురావాలి. ఇంకా మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలి.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను www.crpf.gov.in వెబ్ సైట్లో చూడొచ్చు.
IT Jobs: ఐటీ రంగంలో కొలువుల జాతర.. TCS, Infosys, Wipro, HCLలో 1.20 లక్షల జాబ్స్.. వివరాలివే
ఇంటర్వ్యూ తేదీలు: ఇంటర్వ్యూలను నవంబర్ 22, 24, 29 తేదీల్లో నిర్వహించనున్నారు.
-ఇంటర్వ్యూలు నిర్వహించే చిరునామాలు, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CRPF, Defence Ministry, Government jobs, Job notification