• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • CRPF RECRUITMENT 2021 THE CENTRAL RESERVE POLICE FORCE HAS INVITED APPLICATIONS FOR THIS POSTS HERE THE FULL DETAILS GH SRD

CRPF Recruitment 2021: సీఆర్‌పీఎఫ్​లో ఉద్యోగాల భర్తీ.. ఎంపికైతే నెలకు రూ. 60 వేలకు పైగా వేతనం..పూర్తి వివరాలు..

CRPF Recruitment 2021: సీఆర్‌పీఎఫ్​లో ఉద్యోగాల భర్తీ.. ఎంపికైతే నెలకు రూ. 60 వేలకు పైగా వేతనం..పూర్తి వివరాలు..

CRPF Recruitment 2021: నిరుద్యోగులకు మరో మంచి అవకాశం. నెలకు 60 వేలకు పైగా వేతనం సంపాదించే ఛాన్స్. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్ ఫోర్స్​ (సీఆర్​పీఎఫ్​) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

  • Share this:
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్ ఫోర్స్​ (సీఆర్​పీఎఫ్​) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్​లో భాగంగా వైద్య విభాగంలో ఫిజియోథెరపిస్టులు, న్యూట్రిషనిస్టుల పోస్టులను భర్తీ చేయనుంది. న్యూఢిల్లీలోని సీఆర్​పీఎఫ్​కు చెందిన స్పోర్ట్స్ బ్రాంచ్​ ట్రైయినింగ్​ డైరెక్టరేట్​లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జూన్​ 25లోపు సీఆర్​పీఎఫ్​ అధికారిక వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* మొత్తం ఖాళీల సంఖ్య – 06 (ఫిజియోథెరపిస్ట్ – 05, న్యూట్రిషనిస్ట్ – 01)

* పని ప్రదేశాలు
ఫిజియోథెరపిస్ట్​గా ఎంపికైన అభ్యర్థులు న్యూ ఢిల్లీ, గురుగ్రామ్, జలంధర్, చండీగర్​, సోనెపట్ ప్రాంతాల్లోని సీఆర్​పీఎఫ్​కు చెందిన స్పోర్ట్స్ బ్రాంచ్ ట్రైయినింగ్ డైరెక్టరేట్ కేంద్రాల్లో పని చేయాల్సి ఉంటుంది. అదే విధంగా న్యూట్రిషనిస్ట్​గా ఎంపికైన అభ్యర్థులు సైతం సంస్థకు చెందిన సంబంధిత కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

* జీత భత్యాలు
ఫిజియోథెరపిస్ట్​గా ఎంపికైన వారు రూ .50,000 నుంచి రూ. 60,000 నెలవారీ జీతం అందుకుంటారు. ఇక, న్యూట్రిషనిస్ట్​గా ఎంపికైన వారు రూ .50,000 నుంచి 60,000 వరకు నెలవారీ జీతం అందుకుంటారు.

* విద్యార్హతలు
ఫిజియోథెరపిస్ట్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన భారతీయ లేదా విదేశీ విశ్వవిద్యాలయం నుంచి ఫిజియోథెరపీ (ఎంపిటి స్పోర్ట్స్) లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక, న్యూట్రిషనిస్ట్ పోస్టు కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు న్యూట్రిషన్​లో ఎంఎస్సి కోర్సు లేదా న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్ లో పిజి డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

* వయో పరిమితి
ఫిజియోథెరపిస్ట్​కు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి. న్యూట్రిషనిస్ట్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 50 ఏళ్లలోపు ఉండాలి.

* చివరితేది
అభ్యర్థులు 2021 జూన్ 25లోపు సీఆర్​పిఎఫ్​ అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.
Published by:Sridhar Reddy
First published: