హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CRPF Recruitment 2021: భారీ వేతనంతో సీఆర్పీఎఫ్ లో ఉద్యోగాలు.. 22వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు.. వివరాలివే

CRPF Recruitment 2021: భారీ వేతనంతో సీఆర్పీఎఫ్ లో ఉద్యోగాలు.. 22వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఇంటర్వ్యూ (Job Interviews) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూలను నవంబర్ 22, 24, 29 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి ...

  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పంది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మెడికల్ ఆఫీసర్ (MO), జనరల్ డ్యూటీస్ మెడికల్ ఆఫీసర్(GDMO) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులను ఇంటర్వ్యూల (Interviews) ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

  -స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ విభాగంలో మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పీజీ తర్వాత ఏడాదిన్నర అనుభవం ఉండాలి. పీజీ డిప్లొమా చేసిన వారికి రెండున్నరేళ్ల అనుభవం ఉండాలని తెలిపారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 85,000 వరకు వేతనం చెల్లించనున్నారు.

  Sainik School Recruitment 2021: సైనిక్ స్కూల్, చిత్తోర్‌ఘర్ లో ఉద్యోగాలు.. రూ. 44 వేల వరకు వేతనం.. ఇలా అప్లై చేయండి

  -GDMO విభాగంలో మొత్తం 31 ఖాళీలు ఉన్నాయి. ఎంబీబీఎస్, ఇంటర్న్ షిప్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000 వరకు వేతనం చెల్లించనున్నారు.

  Cochin Shipyard Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. కొచ్చిన్ షిప్ యార్డ్ లో రూ. 50 వేల వేతనంతో ఉద్యోగాలు

  ఇతర పూర్తి వివరాలు:

  -ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో (Job Notifications) స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ (Job Contract) గడువు మూడేళ్లు ఉంటుంది. మరో రెండేళ్లను కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంటుంది.

  -అభ్యర్థులు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో (Job Notification)స్పష్టం చేశారు.

  -వేతనం మినహా ఇతర టీఏ, డీఏ వంటి సదుపాయాలు ఉండవని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  -అభ్యర్థుల వయస్సు 70 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  IOCL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్. ఇండియన్ ఆయిల్ లో 527 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

  -ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు కావాల్సిన అన్ని ధ్రువపత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

  -విద్యార్హత, వయస్సు, అనుభవం ధ్రువపత్రాలను తీసుకురావాలి. ఇంకా మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలి.

  -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను www.crpf.gov.in వెబ్ సైట్లో చూడొచ్చు.

  ECIL Recruitment 2021: ఈసీఐఎల్ లో రూ. 23 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

  ఇంటర్వ్యూ తేదీలు: ఇంటర్వ్యూలను నవంబర్ 22, 24, 29 తేదీల్లో నిర్వహించనున్నారు.

  -ఇంటర్వ్యూలు నిర్వహించే చిరునామాలు, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Central Government Jobs, CRPF, Job notification

  ఉత్తమ కథలు