CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 789 పోలీస్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

CRPF Recruitment 2020 | పోలీస్ ఉద్యోగం మీ కలా? ఎస్ఐ కావాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-CRPF ఖాళీలను భర్తీ చేస్తోంది.

news18-telugu
Updated: July 14, 2020, 12:39 PM IST
CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 789 పోలీస్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 789 పోలీస్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-CRPF ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్, ఎస్ఐ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 789 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 20న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సీఆర్‌పీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్ https://www.crpf.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో చివరి తేదీలోగా పంపాల్సి ఉంటుంది.

SBI Jobs: గుడ్ న్యూస్... ఎస్‌బీఐలో 431 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 292 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

CRPF Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 789
ఇన్‌స్పెక్టర్- 1
సబ్ ఇన్‌స్పెక్టర్- 183అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్- 157
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ / ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నీషియన్- 1
హెడ్ కానిస్టేబుల్- 197
కానిస్టేబుల్- 250

DRDO Jobs: గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలకు గడువు పెంపు

Bank Jobs: బ్యాంక్ జాబ్ మీ కలా? 9640 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఐబీపీఎస్

CRPF Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 31
రాతపరీక్ష- 2020 డిసెంబర్ 20
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు- రూ.200.
పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, న్యూఢిల్లీ, గువాహతి, జమ్మూ, ప్రయాగ్ రాజ్, అజ్మేర్, నాగ్‌పూర్, ముజాఫర్‌పూర్, పల్లీపురం
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, దరఖాస్తుల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
DIGP, Group Centre,
CRPF, Bhopal,
Village-Bangrasia,
Taluk-Huzoor,
District-Bhopal, M.P.-462045.
Published by: Santhosh Kumar S
First published: July 14, 2020, 12:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading