CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 1412 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

CRPF Recruitment 2020 | సీఆర్‌పీఎఫ్‌లో 1412 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పురుషులు, మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 3, 2020, 10:29 AM IST
CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 1412 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 1412 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-CRPF  మొత్తం 1412 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పటికే జనరల్ డ్యూటీ, బగ్లర్, మాలి, పెయింటర్ లాంటి విభాగాల్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పురుషులు, మహిళల నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. వీరు గ్రూప్‌ సీ హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-LDCE 2019 ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవి తాత్కాలిక పోస్టులే అయినా ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం పర్మనెంట్ కావొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 మార్చి 5 చివరి తేదీ. సీఆర్‌పీఎఫ్‌లో అవసరాలను బట్టి పోస్టుల్ని తగ్గించొచ్చు. పెంచొచ్చు.

CRPF Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 1412

పురుషులు- 1331
మహిళలు- 81
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 5


రాత పరీక్ష- 2020 ఏప్రిల్ 19అర్హత- సర్వీస్‌లో నాలుగేళ్లు పూర్తి చేయడంతో పాటు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. నాలుగేళ్లు పూర్తి చేసిన కానిస్టేబుళ్లకు వెయిటేజీ ఉంటుంది. 4-5 ఏళ్ల సర్వీస్ ఉంటే 04 మార్కులు, 5-6 ఏళ్ల సర్వీస్ ఉంటే 8 మార్కులు, 6-7 ఏళ్ల సర్వీస్ ఉంటే 12 మార్కులు, 7-8 ఏళ్ల సర్వీస్ ఉంటే 20 మార్కుల వెయిటేజీ లభిస్తుంది.
వయస్సు- గరిష్టంగా 32 ఏళ్లు
విద్యార్హత- 10+2 పాస్ కావాలి.
ఎంపిక ప్రక్రియ- రాత పరీక్ష, శరీర కొలతలు, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, యోగ్యతా పత్రం, మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
శిక్షణ- ఎంపికైన అభ్యర్థులకు ఎల్‌డీసీఈ కోర్సుతో పాటు రెండేళ్లు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం- ఆసక్తిగల కానిస్టేబుల్స్ తమ యూనిట్స్ లేదా ఆఫీస్‌ల ద్వారా ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.
సీఆర్‌పీఎఫ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 174 జాబ్స్... ఖాళీల వివరాలివే

Education Loan: చదువుకోవడానికి డబ్బులు కావాలా? ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు

Resume Tips: రెజ్యూమె తయారుచేసేముందు ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి
First published: March 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు