హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Police Jobs: 9212 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..

Police Jobs: 9212 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొత్తం 9,212 పోస్టులను రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు . ఇందులో పురుషులకు 9,105, మహిళా అభ్యర్థులకు 107 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు పే లెవల్ 3 ప్రకారం.. రూ.21,700 - 69,100 పొందుతారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 9 వేలకు పైగా కానిస్టేబుళ్ల (టెక్నికల్ మరియు ట్రేడ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.crpf.gov.inని సందర్శించడం ద్వారా రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి (మార్చి 27) నుండి ప్రారంభమై ఏప్రిల్ 24న ముగుస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక కోసం 2023 జూలై 1 నుండి 13 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జూన్ 20న విడుదల చేస్తారు. రాత పరీక్షతో పాటు, నియామక ప్రక్రియలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటాయి.

మొత్తం 9,212 పోస్టులను రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు . ఇందులో పురుషులకు 9,105, మహిళా అభ్యర్థులకు 107 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు పే లెవల్ 3 ప్రకారం.. రూ.21,700 - 69,100 పొందుతారు. వివిధ పోస్టులకు అర్హత ప్రమాణాలు, వయోపరిమితి మొదలైనవి వేర్వేరుగా ఉంటాయి.

MTS-Clerk Posts: అప్పర్ డివిజన్ క్లర్క్, MTS పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు ఇలా..

పురుషుల పోస్టులు: మోటార్ మెకానిక్, డ్రైవర్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్రాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మన్, బార్బర్, సఫాయి కర్మచారి తదితర పోస్టులు ఉన్నాయి.

మహిళా పోస్టులు: బగ్లర్, కుక్, వాటర్ క్యాషియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్.

పరీక్ష ఫీజు జనరల్, EWS మరియు OBC కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించబడింది. SC/ST అభ్యర్థులు, మహిళలు (అన్ని కేటగిరీలు) అభ్యర్థులు మరియు మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: మార్చి 27

దరఖాస్తు కోసం చివరి తేదీ: ఏప్రిల్ 25

అడ్మిట్ కార్డ్ జారీ- జూన్ 20-25

CRPF కానిస్టేబుల్ పరీక్ష: జులై 1 నుంచి 13

ఎలా దరఖాస్తు చేయాలి

-ముందుగా CRPF అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

-తర్వాత రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

-CRPF ఫారమ్‌ను పూరించి.. సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి.

-వివరాలను నింపి.. ఫైనల్ సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

-భవిష్యత్ అవసరాల కొరకు .. ఆ దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

First published:

Tags: Central Government Jobs, CRPF, JOBS, Police jobs