రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ విధానంల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయింది. దరఖాస్తులకు చివరి తేదీ 20 డిసెంబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య 24. విభాగాల వారీగా ఇలా..
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ | 04 |
జూనియర్ సివిల్ ఇంజనీర్ | 01 |
ఎగ్జిక్యూటివ్, పర్సనల్ / అడ్మినిస్ట్రేషన్ / HRD | 09 |
ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ మరియు అకౌంట్స్ | 08 |
కార్యనిర్వాహక, Procurement | 02 |
వయోపరిమితి..
అభ్యర్థుల యొక్క వయస్సు డిసెంబర్ 31, 2022 నాటికి 22 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు..
1. జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ - ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
2. జూనియర్ సివిల్ ఇంజనీర్ - సివిల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి.
3. ఎగ్జిక్యూటివ్, పర్సనల్ లేదా అడ్మిస్ట్రిషేన్ - ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆర్ట్స్ లేదా కామర్స్ లేదా సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
4. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
5. ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్ మెంట్ - ఏదైనా బ్రాంచ్ లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా లాజిస్టిక్ అండ్ సప్లై విభాగంలో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి.
రాత పరీక్ష..
రెండు భాషల్లో ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించనున్నారు. పార్ట్ 1 లో జనరల్ ఆప్టిట్యూడ్ , రీజనింగ్ విభాగంలో 24 ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్ట్ లో 96 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్, పర్సనల్ లేదా అడ్మినిస్ట్రేషన్ పోస్టులకు జనరల్, రీజనింగ్ విభాగాల నుంచి 40 ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 80 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పోస్టులకు జనరల్, రీజనింగ్ విభాగాల నుంచి 40 ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 80 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు న్యూ ఢిల్లీ , కోల్ కత్తా, ముంబయ్, చెన్నై అండ్ సికింద్రాబాద్ రైల్వే జోన్లలోని ఏదో ఒక జోన్ లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,852 వరకు జీతం ఇవ్వబడుతుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-తర్వాత కెరీర్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. దీని తర్వాత మరో వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.
-దీనిలో అక్కడ పేర్కొన్న సూచనలు చదివి.. డిక్లరేషన్ పై క్లిక్ చేసి.. స్టార్ట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
-ఇక్కడ వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తే.. మీ మొబైల్ కు యూజర్ నేమ్, పాసట్ వర్డ్ వస్తుంది.
-యూజర్ నేమ్, పాస్ వర్డ్ సహాయంతో ఇక్కడ క్లిక్ ఇచ్చి లాగిన్ అవ్వాలి.
-దీనిలో అవసరమైన డాక్యుమెంట్స్, పాస్ ఫొటో, సంతకాలను అప్ లోడ్ చేసి.. ఫైనల్ సబ్మిట్ బటన్ పై క్లిక్ ఇస్తే.. మీ దరఖాస్తు పూర్తి అయినట్లే.
-చివరగా ఆ దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian, Indian Railways, JOBS, Railway jobs