Home /News /jobs /

CREDR JOBS NOTIFICATION RELEASED FOR VARIOUS JOB VACANCIES HERE APPLICATION PROCESS NS

CREDR Jobs: డిగ్రీ చేసిన అభ్యర్థులకు శుభవార్త.. CREDRలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెకండ్ హ్యాండ్ బైక్ ల కొనుగోలు, అమ్మకాలతో పాటు డోర్ స్టెప్ బైక్ సర్వీసులను అందించే ప్రముఖ క్రెడార్ (CREDR) సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

    సెకండ్ హ్యాండ్ బైక్ ల కొనుగోలు, అమ్మకాలతో పాటు డోర్ స్టెప్ బైక్ సర్వీసులను అందించే ప్రముఖ క్రెడార్ (CREDR) సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమె మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఎక్సేంజ్ ఎక్స్పర్ట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సంస్థకు చెందిన అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ NCR, హైదరాబాద్, జైపూర్, పూణే లోని కార్యాలయాల్లో ఈ ఖాళీలు (Job Vacancies) ఉన్నాయి. జాబ్ కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సప్లై (Supply) డిపార్ట్మెంట్ లోని ప్రొక్యూర్మెంట్/డిస్పోజల్ వర్టికల్ లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇచ్చిన సమయంలో ఎక్కువ సంఖ్యలో మోటార్ సైకిళ్లను ఎక్సేంజ్ చేయడమే ఎంపికైన అభ్యర్థుల ప్రధాన విధి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎక్సేంజ్ కు ముందు తనిఖీ చేయాల్సి ఉంటుంది.

    విధులు, బాధ్యతలు:
    - ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు షోరూం ప్రతినిధులు, కస్టమర్లతో ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది.
    - టెస్ట్ రైడ్ తర్వాత ఎక్సేంజ్ చేయబడిన వాహనాలు పూర్తిగా తనిఖీ చేసినట్లు నిర్ధారించాల్సి ఉంటుంది.
    - క్లైయింట్ల నుంచి సేకరించిన డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించి వేర్ హౌజ్ అడ్మిన్ కు అందించాల్సి ఉంటుంది.
    - నెలవారీ లక్ష్యాలను పర్ డే ఎక్స్ఛేంజీలుగా విభజించాలి, వీటిని రోజు పూర్తయ్యేలోగా చేరుకోవాలి.
    CREDR Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో credrలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

    - తమకు, షోరూమ్ సిబ్బందికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎడ్యుకేట్ చేయడం మరియు పెంపొందించడం ద్వారా పోటీ తొలగపోతుంది.
    కంపెనీ ఇచ్చిన టూల్స్ ద్వారా సేల్స్, ట్రైనింగ్ వివరాలను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

    అభ్యర్థి గురించి..
    - లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడగలగాలి.
    - అంచాలనకు అనుగుణంగా లేదా అంతకు మించి ఫలితాలను చూపించాల్సి ఉంటుంది.
    - నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలి.
    - ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి.

    అర్హతలు:
    ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
    సేల్స్ లో కనీసం రెండేళ్లకు పైగా అనుభవం పొంది ఉండాలి.


    ఎలా అప్లై చేయాలంటే..

    - అభ్యర్థులు తమ Resume ను hr@credr.com మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది.

    - సబ్జెక్ట్ స్థానంలో "Role Name - Location Name" రాసి ఉండాలి.

    - అప్ డేట్ తో పాటు ఖచ్చిమైన సమాచారాన్ని కలిగిన Resume ను పంపించాలి.

    - ఈమెయిల్ అందుకున్న తర్వాత మీ అభ్యర్థిత్వాలను పరిశీలించి.. జాబ్ ప్రొఫైల్ కు మ్యాచ్ అయ్యే వారికి సమాచారం అందిస్తారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CREDR, Job notification, JOBS, Private Jobs

    తదుపరి వార్తలు