Home /News /jobs /

CREDR JOBS APPLICATIONS INVITING FOR VARIOUS JOB VACANCIES HERE APPLICATION PROCESS NS

CREDR Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో credrలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెకండ్ హ్యాండ్ బైక్ ల కొనుగోలు, అమ్మకాలతో పాటు డోర్ స్టెప్ బైక్ సర్వీసులను అందించే ప్రముఖ క్రెడార్ (CREDR) సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

    సెకండ్ హ్యాండ్ బైక్ ల కొనుగోలు, అమ్మకాలతో పాటు డోర్ స్టెప్ బైక్ సర్వీసులను అందించే ప్రముఖ క్రెడార్ (CREDR) సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలుఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమె మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఆటో ఎక్స్పర్ట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సంస్థకు చెందిన అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ NCR, జైపూర్, పూణే లోని కార్యాలయాల్లో ఈ ఖాళీలు (Job Vacancies) ఉన్నాయి. జాబ్ కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఆన్లైన్ సెల్ (Online Sell) డిపార్ట్మెంట్ లోని ఇన్స్పెక్షన్ వర్టికల్ లో ఈ ఖాళీలు ఉన్నాయి. తమ డైనమిక్ టీమ్ లో పని చేయడానికి టాలెంటెడ్ మరియు అనుభవం కలిగిన మెకానిక్ల కోసం ఈ నియామకాలను చేపట్టారు. వాహనాలను తనిఖీ చేయడం, అసెంబ్లింగ్ మిషనరీ లాంటి విధులను ఎంపికైన వారు నిర్వర్తించాల్సి ఉంటుంది.

    విధులు, బాధ్యతలు:
    - మోటార్ సైకిల్ సర్వీస్ టెక్నీషియన్లు రోటీన్ మెయింటెన్స్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉదాహరణకు స్పార్క్ ప్లగ్లను మార్చడం, ఆయిల్ మార్చడం లాంటిది.
    - ఇంజన్ రిపేర్ చేయడం. పాడై పోయిన పరికరాలను మార్చడం.
    వాహనాల సామర్థ్యాన్ని చెక్ చేయడం
    - వాహనాల్లో ఏర్పడిన లోపాన్ని గుర్తించి రిపేర్ చేయడం.
    - వేర్ హౌస్ లో ఉండే వాహనాలన్నింటినీ కండిషన్లో ఉండేలా చేయడం.
    సర్వీస్ హెడ్ కు డౌలీ సర్వీస్ రిపోర్టు ను పంపించడం.
    Jobs in News18 Telugu: డిగ్రీ చేసిన వారికి గుడ్ న్యూస్.. 'న్యూస్18 తెలుగు'లో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

    విద్యార్హతలు:
    - అభ్యర్థి తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి.
    - ఒకేషనల్ స్కూల్ లేదా ట్రేడ్ స్కూల్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.
    - కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
    - వాహనాల రిపేరు పై లోతైన అవగాహన ఉండాలి.
    - సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యం ఉండాలి.
    - కమ్యూనికేషన్ మరియు కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి.


    ఎలా అప్లై చేయాలంటే..
    - అభ్యర్థులు తమ Resume ను hr@credr.com మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది.
    - సబ్జెక్ట్ స్థానంలో "Role Name - Location Name" రాసి ఉండాలి.
    - అప్ డేట్ తో పాటు ఖచ్చిమైన సమాచారాన్ని కలిగిన Resume ను పంపించాలి.
    - ఈమెయిల్ అందుకున్న తర్వాత మీ అభ్యర్థిత్వాలను పరిశీలించి.. జాబ్ ప్రొఫైల్ కు మ్యాచ్ అయ్యే వారికి సమాచారం అందిస్తారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CREDR, Job notification, JOBS, Private Jobs

    తదుపరి వార్తలు