హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CREDR Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. CREDR సంస్థలో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

CREDR Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. CREDR సంస్థలో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు శుభవార్త. సెకండ్ హ్యాండ్ బైక్ ల కొనుగోలు, అమ్మకాలతో పాటు డోర్ స్టెప్ బైక్ సర్వీసులను అందించే ప్రముఖ క్రెడార్ (CREDR) సంస్థ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

  నిరుద్యోగులకు శుభవార్త. సెకండ్ హ్యాండ్ బైక్ ల కొనుగోలు, అమ్మకాలతో పాటు డోర్ స్టెప్ బైక్ సర్వీసులను అందించే ప్రముఖ క్రెడార్ (CREDR) సంస్థ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు తమ రెజ్యూమెను మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. లాజిస్టిక్ ఎక్స్పర్ట్ (Logistic Expert) విభాగంలో ఈ ఖాళీలు (Jobs) ఉన్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, పూణేలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆటోమొబైల్ కంపెనీలోని లాజిస్టిక్ టీమ్ లో భాగం కావాల్సి ఉంటుంది. కంపెనీ అవసరాలకు అనుగుణంగా బైక్ లను డెలివరీ చేయాల్సి ఉంటుంది.

  ముఖ్యమైన బాధ్యతలు:

  - కేటాయించిన బైక్ ను నిర్ణీత సమయంలో పిక్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది.

  - పిక్ అప్ కంటే ముందు బైక్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

  - ఏమైనా డాక్యుమెంట్లు మిస్ అయితే.. కార్యాలయంలో లేదా పై సిబ్బందితో కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది.

  - బైక్ పని చేయకపోతే చిన్న చిన్న సమస్యలు ఎదురైతే పరిష్కరించే నైపుణ్యం ఉండాలి.

  - అధీకృత సిబ్బందికి బైక్ ను మరియు కావాల్సిన డాక్యుమెంట్లను హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది.

  ఈ అంశాలు తప్పనిసరి:

  - అభ్యర్థి ఆ సిటీకి చెందినవాడై ఉండాలి.

  - టూ వీలర్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరి.

  - స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆండ్రాయిడ్ యాప్స్ ను వాడడం తెలిసి ఉండాలి.

  - జాయిన్ అయ్యే సమయంలో పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి.

  ఎలా అప్లై చేయాలంటే..

  - అభ్యర్థులు తమ Resume ను hr@credr.com మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది.

  - సబ్జెక్ట్ స్థానంలో "Role Name - Location Name" రాసి ఉండాలి.

  - అప్ డేట్ తో పాటు ఖచ్చిమైన సమాచారాన్ని కలిగిన Resume ను పంపించాలి.

  - ఈమెయిల్ అందుకున్న తర్వాత మీ అభ్యర్థిత్వాలను పరిశీలించి.. జాబ్ ప్రొఫైల్ కు మ్యాచ్ అయ్యే వారికి సమాచారం అందిస్తారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CREDR, JOBS, Private Jobs

  ఉత్తమ కథలు