హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CREDR Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో CREDR సంస్థలో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

CREDR Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో CREDR సంస్థలో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెకండ్ హ్యాండ్ బైక్ ల కొనుగోలు, అమ్మకాలతో పాటు డోర్ స్టెప్ బైక్ సర్వీసులను అందించే ప్రముఖ క్రెడార్ (CREDR) సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.

  సెకండ్ హ్యాండ్ బైక్ ల కొనుగోలు, అమ్మకాలతో పాటు డోర్ స్టెప్ బైక్ సర్వీసులను అందించే ప్రముఖ క్రెడార్ (CREDR) సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్ల (Job Notification) విడుదల చేస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమె (Resume)ను మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సప్లై విభాగంలోని సపోర్ట్ వర్టికల్ లో ఈ ఖాళీలు ఉన్నాయి. టెలికాలర్ గా పని చేయడానికి ఉత్సావంతులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కస్టమర్లకు సలహాలు సూచనలు అందించి వారి అభిమానాలను చూరగొనేలా పని చేయాల్సి ఉంటుంది. కస్టమర్లను ఆక్టుటకోవడమే లక్ష్యంగా బాధ్యతలు నిర్వహించాలి. కంపెనీ ఉత్పత్తుల గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఆ వివరాలను వినియోగదారులకు వివరించగలగాలి. స్థిరమైన వృద్ధిని సాధించడానికి సాధ్యమైన ప్రతి విధంగా అమ్మకాలను సులభతరం చేయడం లక్ష్యంగా పని చేయాలి. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.

  విధులు, బాధ్యతలు:

  - ఇన్ బౌండ్ మరియు అవుట్ బౌండ్ కాల్స్ కు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించాలి.

  - క్లయింట్లకు కాల్ చేసి ప్రొడక్ట్ మరియు సేవల గురించి వివరించాలి.

  - మీటింగ్ లు ఏర్పాటు చేసి అవకాశం ఉన్న కస్టమర్లకు కొత్త వ్యాపారాల గురించి వివరించాలి.

  -ఈమెయిల్స్ మరియు ఫోన్ ఎంక్వెరిలకు రెస్పాండ్ కావాలి.

  - కస్టమర్ల అవసరాలను శ్రద్ధగా వినాలి.

  - ఆన్లైన్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ల గురించి మంచి అవగాహన ఉండాలి.

  - నెలవారీగా ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేయాలి.

  - డైలీ రిపోర్ట్ చేయాలి.

  విద్యార్హతలు:

  - గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

  - కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. అతర పూర్తి వివరాలను పైన అటాచ్ చేసిన ప్రకటనలో చూసుకోవచ్చు.

  CREDR Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో CREDRలో జాబ్స్.. హైదరాబాద్ లో ఖాళీలు

  ఎలా అప్లై చేయాలంటే..

  - అభ్యర్థులు తమ Resume ను hr@credr.com మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది.

  - సబ్జెక్ట్ స్థానంలో "Role Name - Location Name" రాసి ఉండాలి.

  - అప్ డేట్ తో పాటు ఖచ్చిమైన సమాచారాన్ని కలిగిన Resume ను పంపించాలి.

  - ఈమెయిల్ అందుకున్న తర్వాత మీ అభ్యర్థిత్వాలను పరిశీలించి.. జాబ్ ప్రొఫైల్ కు మ్యాచ్ అయ్యే వారికి సమాచారం అందిస్తారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CREDR, JOBS, Private Jobs

  ఉత్తమ కథలు