హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Government Jobs: పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌లో ఉద్యోగాలు.. పది, ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు అర్హులు..

Government Jobs: పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌లో ఉద్యోగాలు.. పది, ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు అర్హులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Government Jobs: ఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పర్యావరణ కాలుష్యం, ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా ఈ బోర్డ్ పని చేస్తుంది. దీనిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా పోస్టులకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. సైంటిస్ట్ బి, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, ఫీల్డ్‌ అటెండెంట్‌, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో కనీసార్హత మార్కులు పొందిన అభ్యర్థులను మాత్రమే తదుపరి దశకు ఎంపికచేస్తారు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. స్వీకరణకు చివరి తేదీగా మార్చి 31 నిర్ణయించారు.

1. సైంటిస్ట్‌-బి ఉద్యోగాలు ..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్‌/కెమికల్‌/ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. అంతే కాకుండా.. మాస్టర్స్‌ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. లేదా కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, నెట్‌ అర్హత/ పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం.

2. సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

3. అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్‌పై ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్‌ చేయగలగాలి.

4. జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌..

జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టుకు సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. సైన్స్‌ సబ్జెక్టుతో డిగ్రీ పాసైనవారికి ప్రాధాన్యమిస్తారు.

5. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌..

లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టుకు ఇంటర్మీడియట్‌/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. కంప్యూటర్‌పైన ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్‌ చేయగలగాలి. ఈ అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

CGL Final Results: SSC CGL తుది ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

6. ఫీల్డ్‌ అటెండెంట్‌..

ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టుకు పదోతరగతి పాసవ్వాలి. సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. స్విమ్మింగ్ వచ్చిన వారికి ఈ పోస్టులకు ప్రాధాన్యతనిస్తారు.

7. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్)

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుకు పదోతరగతి పాసవ్వాలి. ఈ అర్హత ఉన్న వారు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వయో పరిమితి..

సైంటిస్ట్‌ 'బి' పోస్టుకు గరిష్ఠ వయసు 18 నుంచి 35 సంవత్సరాలు. అసిస్టెంట్‌ లా ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌, అకౌంట్స్‌ అసిస్టెంట్‌ పోస్టులకు గరిష్ఠ వయసు 18 నుంచి 30 సంవత్సరాలు. జూనియర్‌ టెక్నీషియన్‌, సీనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, ఫీల్డ్‌ అటెండెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు 18- 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం..

ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్టు లేదా ఇంటర్వ్యూ ఉంటుంది.

రాత పరీక్షలో.. సైంటిస్ట్‌ బి పోస్టుకు నిర్వహించే రాత పరీక్ష 100 మార్కులకు, వంద ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ సైన్స్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. సబ్జెక్టు ఆధారిత ప్రశ్నలు 60 ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటల సమయం ఉంటుంది.

First published:

Tags: Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు